నిన్న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ‘ఖైదీ నంబర్  150’ సినిమా ఫస్ట్ లుక్ వెనుక కొన్ని షాకింగ్  నిజాలు ఉన్నాయి అంటూ ఫిలింనగర్ లో చర్చలు జరుగుతున్నాయి.   ఈ సినిమాకోసం రామ్ చరణ్ కొత్తగా ‘కొణిదెల ప్రొడక్షన్స్’ అంటూ తమ ఇంటి పేరుతో ఒక బ్యానర్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా భార్య ఉపాసన ఇనీషియేటివ్ అని అంటున్నారు.  

ముంబాయ్ లో ప్రతీ హీరోకూ సొంతంగా ఒక బ్యానర్ ఉంది. అలాగే వారు ఇతరులతో కూడ సినిమాలు తీస్తుంటారు. కేవలం డబ్బులు సంపాదించడానికే కాకుండా తమ బ్రాండ్ వేల్యూ పెంచుకోవడానికి ఇలా బాలీవుడ్ లో చేస్తూ ఉంటారు.  అందుకే ఇప్పుడు చరణ్ తో ఈ కొత్త ప్రొడక్షన్ కంపెనీ స్టార్ట్ చేయించి ఇక మీదట ఈ బ్యానర్ పై చాలా సినిమాలు తీయాలని ఉపాసన ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 

ఇప్పటి వరకు కేవలం రామ్ చరణ్ ఒక్కడే ఈ 150వ సినిమాకు ప్రొడ్యూసర్  అనుకున్నారు.  అయితే ఈ సినిమా మేకింగ్ లో తమిళ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ వారు కూడా పాత్రదారులే. అందుకే ప్రతీ పోస్టరుపై ‘ఇన్ అసోసియేషన్ విత్ లైకా’ అనే లోగోను కూడా ప్రింట్ చేశారు అని వార్తలు వస్తున్నాయి.  అంతేకాదు ఇప్పటికే అనేక సార్లు వార్తలు వచ్చినట్లుగా  ఈ సినిమాకు చాలామంది రచయితలు మాటలను అందించలేదట. 

మొత్తంగా పరుచూరి బ్రదర్స్ వారే ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తి చేసారు అని తెలుస్తోంది.  దీనితో  ఒకవేళ ఎవరైనా మిగతా రచయితల పేర్లు వేయాల్సి వస్తే పోస్టర్ మీద కాకుండా సినిమాలోపల రచనా సహకారం అని వేస్తారట. తమిళ సినిమా ‘కత్తి’ కి రీమేక్ గా తయారవుతున్న ఈ సినిమా  ‘కత్తిలాంటోడు’ కి బదులు  ‘ఖైదీ నంబర్ 150’ గా మారడం వెనుక  ‘ఖైదీ’ సెంటిమెంట్ మాత్రమే  కాకుండా చాలా కారణాలు ఉన్నాయి అంటున్నారు.   

వర్తమాన రాజకీయ సంఘటనలకు స్క్రిప్ట్ గా మార్చడంలో  పరుచూరి బ్రదర్స్  చాల గట్టి హోమ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది.  రైతుల రుణ మాఫీ, భూ సేకరణ పరిశ్రమలకు వ్యవసాయ భూముల అప్పగింత వంటి సమస్యలను ఈ సినిమాలో ప్రస్తావించినట్లు తెలుస్తోంది. రైతుల సమస్యలపై పోరును ప్రధానంగా చూపిస్తూ వర్తమాన రాజకీయా లపై బలమైన డైలాగులు పరుచూరి బ్రదర్స్ రచించినట్లు టాక్.

దీనితో ఈసినిమా తెలుగుదేశం ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఖరిని టార్గెట్ చేసే అస్త్రంగా మారబోతోంది అన్న వార్తలు వస్తున్నాయి.  అయితే తెలుగుదేశం ప్రభుత్వం అన్నా ఎన్టీఆర్ అన్నా విపరీతమైన గౌరవం ఉన్న పరుచూరి బ్రదర్స్ తెలుగుదేశ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ‘ఖైదీ నంబర్ 150’  కథను మార్చారు అని వార్తలు రావడం  టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..


మరింత సమాచారం తెలుసుకోండి: