తెలుగు చలన చిత్ర రంగానికి ఆ ఇద్దరూ రెండు కళ్ల లాంటి వారు..కాశానికి సూర్య చంద్రులు ఎలాగో తెలుగు సినీ పరిశ్రమకి "ఎన్టీఆర్ - ఏఎన్ఆర్" అలాగే. తెలుగు చిత్ర సీమ రధ సారధులు ఇలా ఈ ఇద్దరు హీరోల గురించి చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది. ఆ ఇద్దరే నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు.  ఇద్దరూ కలిసి ఎన్నో చిత్రాల్లో అన్నదమ్ములుగా కూడా నటించారు. తెర పైనే కాక నిజ జీవితంలో కూడా వీరిని అన్నదమ్ములు, రామ లక్ష్మణులు అని ప్రేక్షకులు పిలుచుకునేవారు.

అంతటి అద్భుతమైన అనుబంధం వీరి నడుమ ఉందనడంలో అతిశయోక్తి లేదు. రాజకీయాల్లో కి వచ్చి పార్టీ పెట్టినప్పుడు, ఏఎన్ఆర్ ని కూడా ఆహ్వానించారు ఎన్టీఆర్ అయితే ఆరోగ్య కారణాల వల్ల రాలేనని ఎన్టీఆర్ కి తన అభినందనలు తెలిపారు.  

ఓరోజు తను రాజకీయాల్లో ఉన్నా నువ్వు కూడా రావొచ్చుకదా బ్రదర్ అన్న మాటకు ఈ పదవులు ఎందుకు బ్రదర్" అని సున్నితంగా తిరస్కరించారు ఏఎన్ఆర్.ఇద్దరికీ ఒకేసారి పద్మశ్రీ రావడం ఆనందదాయకం. వీరి మధ్య స్నేహం ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శదాయకం.


మరింత సమాచారం తెలుసుకోండి: