మెగా ఈవెంట్ ఏదైనా మెగా అభిమానుల్లో పవర్ స్టార్ ను అమితంగా ప్రేమించే ఫ్యాన్స్ పవర్ స్టార్.. పవర్ స్టార్.. అంటూ జరిగే ఈవెంట్ ను రచ్చ రచ్చ చేయడం మాములే. కేవలం మెగా హీరో ఫంక్షన్ కే కాదు బయట హీరోలకు ఈ తాకిడి ఎక్కువైంది. అందుకే నాగ బాబు, బన్ని పవన్ ఫ్యాన్స్ మీద వీరంగం ఆడేశారు. మెగా ఈవెంట్ జరిగితే ఫ్యాన్స్ పవర్ స్టార్ పవర్ స్టార్ అని కేకలేయడం మానేస్తారా అంటే అవును మానేశారని నిన్న జరిగిన మెగాస్టార్ పుట్టినరోజు ఏ డే ఫర్ మెగాస్టార్ ఈవెంట్ లో రుజువైంది. 


మెగా హీరోల్లో మెగాస్టార్ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఏర్పరచుకున్న పవర్ స్టార్ అంటే మెగా హీరోలకు ఇష్టమే కాని ఆయన ఫ్యాన్స్ చేస్తున్న హడావిడికి ఫ్యామిలీకి దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఫ్యాన్స్ గోల చేయడం మాములే కాని ఈవెంట్ ను పాడు చేసేంత గోల చేస్తే అది కచ్చితంగా మంచి పద్ధతి కాదు. ఇక పవర్ స్టార్ ఫ్యాన్స్ కు పవన్ సపోర్ట్ ఉందా లేదా అన్నది కూడా అర్ధం కాని ప్రశ్నే. పవర్ స్టార్ కేకలతో ఈవెంట్ ఏదైనా అదిరిపోయే హంగామా చేసే పవన్ ఫ్యాన్స్ నిన్న నోరు కట్టుకోవాల్సి వచ్చింది.     


అయితే దీని వెనుక గట్టి కార్యచరణలే ఉన్నట్టు తెలుస్తుంది. బర్త్ డే ఈవెంట్ లో ఎవరు పవర్ స్టార్ అంటూ అరవకుండా ముందే తగిన జాగ్రత్తలు తీసుకున్నారట. అంతేకాదు ఫ్యాన్స్ కు కూడా కొన్ని నిభంధనలు పెట్టినట్టు తెలుస్తుంది. బర్త్ డే ఈవెంట్ లో శిల్పకళా వేదిక బయట మెగా హీరోలందరి కటౌట్స్ పెట్టడం జరిగింది. అందులో పవర్ స్టార్ కూడా ఉన్నాడు. ఫ్యాన్స్ వేరు చేస్తున్నారే తప్ప తమ కుటుంబంలో పవర్ స్టార్ ఉన్నాడంటూ వారి కటౌట్ చూస్తే అర్ధమవుతుంది. ఇక నిన్న జరిగిన పార్టీలో కూడా ఎక్కడ పవర్ స్టార్ అంటూ కేకలేస్తారేమో అని మెగా హీరోలందరు ఓ విధంగా భయపడ్డారు. 


మెగా అభిమానుల హంగామతో ఏ డే ఫర్ మెగాస్టార్ ప్రోగ్రాం సూపర్ సక్సెస్ అయ్యింది. అథిధులుగా వచ్చినా రాం చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్, సాయి ధరం తేజ్ లు మెగాస్టార్ మూవీలోని డైలాగ్స్ తో ఫ్యాన్స్ ను అలరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: