తెలుగు చిత్రం పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎంతో భవిష్యత్ ను ఊహించుకొని సినిమా ఇండస్ట్రీలో అడుగు పెడుతుంటారు. తమకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకోవాలని ప్రతి ఒక్కిరికీ ఆశ ఉంటుంది. జూనియర్ ఆర్టిస్టు నుంచి పెద్ద హీరో, హీరోయిన్ల వరకు దర్శకులు, సంగీత దర్శకులు ఇలా ఎవరికి వారే తాము బెస్ట్ అనిపించుకోవాలని అనుకుంటారు. అయితే తమ కెరీర్ అంచెలంచెలుగా గా పెరిగిపోతున్న సమయంలో కొన్ని సార్లు విషాద ఘటనలు చోటు చేసుకోవడం వారి ఆశలు నిరాశలుగా మిగలడం జరుగుతుంది.
Sukumar's Assistant Dies, Mystery Shrouds!
గత సంవత్సరం నుంచి సినిమా ఇండస్ట్రీలో చాలా విషాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సంవత్సరం ‘నాన్నకు ప్రేమతో ’ వంటి బ్లాక్ బ్లస్టర్ అందించిన సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్ విక్రమ్ మృతి చెందాడు.  నాన్నకు ప్రేమతో చిత్రానికి సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన విక్రం మొన్న రాత్రి బిల్డింగ్ పై నుండి పడిచనిపోయినట్లు తెలుస్తోంది .

 కాగా  విక్రం మృతి తో అతడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు .  అయితే అది ప్రమాదమా..లేదా ఎవరైనా చేశారా లేక ఆత్మహత్య చేసుకున్నాడా అన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: