యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతా గ్యారెజ్’ సినిమా ప్రస్తుతం థియోటర్స్ ని హిట్ చేయటానికి రెడీగా ఉంది. ఈ మూవీకి సంబంధించిన అవుట్ పుట్ బాగా రావటతో..ఈ మూవీ ఎటువంటి సక్సెస్ ని సాధిస్తుందో చూడాలి అని చిత్ర యూనిట్ కి సంబంధించిన ప్రతి ఒక్కరు ఆసక్తిగా చూస్తున్నారు. అలాగే అభిమానులు సైతం ఎన్టీఆర్ ఈ మూవీలో ఏ విధంగా నటించాడు వంటి విషయాలను తెలుసుకునేందుకు చాలా ఆసక్తి చూపుతున్నారు.


ఇదిలా ఉంటే ఈ మూవీకి సంబంధించిన విషయంలో ఎన్టీఆర్ రాంగ్ స్టెప్ వేశాడని అంటున్నారు. అదే తన మైనస్ అని అంటున్నారు. ఎందుకంటే జూ. ఎన్టీఆర్ ఒకసారి ఒక టెక్నిషియన్ ని నమ్మాడు అంటే...ఇక వారు చేస్తున్న వర్క్ పై ఎప్పుడూ క్రాస్ వెరిఫికేషన్ చేయరు. ఇది కొన్ని సందర్భాల్లో తనకి మంచి ఫలితాలను ఇస్తుంది కానీ...ఒక్కోసారి వ్యతిరేఖ ఫలితాలను చూపుతుంది.


ఆ విధంగానే ప్రస్తుతం తను నటించిన జనతా గ్యారేజ్ మూవీ విషయంలోనూ ఎన్టీఆర్..డైరెక్టర్ విషయంలో ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. డైరెక్టర్ మీద నమ్మకంతోనే తను జనతా గ్యారేజ్ మూవీకి సంబంధించిన షూటింగ్ విషయంలో కానీ...పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో కానీ ఏనాడు క్రాస్ చెక్ చేయలేదు. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు...వారి మూవీలకి సంబంధించిన అవుట్ పుట్ ఎలా వస్తుంది అనే దానిపై షెడ్యూల్ షెడ్యూల్ కి డైరెక్టర్ పై కాస్త ఒత్తిడి తీసుకువస్తుంటారు.


కానీ ఎన్టీఆర్ మాత్రం ఒక్కసారి డైరెక్టర్ ని నమ్మితే...ఇక అవుట్ వచ్చేంత వరకూ వాళ్ళ జోలికి వెళ్ళరు. అయితే చాలా మంది ఇండస్ట్రీ పెద్దలు మాత్రం...ఇది ఎన్టీఆర్ లోని మైనస్ అని అంటున్నారు. ప్రస్తుతం సినిమా అంతా కమర్షియల్ బిజినెస్ గా మారినప్పుడు...హీరో కచ్ఛితంగా అవుట్ పుట్ పై క్రాస్ చెక్ చేసుకొని తీరాల్సిందే అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ ఆగష్టు 27న సెన్సార్‌కు వెళ్ళనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: