తెలంగాణలో కరడుగట్టిన నేరస్తుడు రెండు రాష్ట్రాల్లో ముప్పయి సంవత్సరాలు తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించిన క్రిమినల్ నయీమ్ ఎట్టకేలకు షాద్ నగర్ లో గ్రే హౌండ్స్ దళాలు ఎన్ కౌంటర్ చేశారు. అయితే నయీమ్ తన చుట్టూ గట్టి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం రక రకాల వేషాలు మారుస్తూ తప్పించుకొని తిరిగేవాడని ఎలాంటి వారినైనా బెదిరించి డబ్బులు వసూళ్లు చేసేవాడని నయీమ్ గురించి ఒక్కో నిజాలు బయట పడుతున్నాయి. రీసెంట్ గా ఓ వ్యాపారిని ఐదు కోట్లు డిమాండ్ చేయగా చివరికి ఒక కోటి రూపాయలకు డీల్ కుదుర్చుకున్నారు..దానికి సంబంధించిన ఆడియో టేప్ ఒకటి సోషల్ నెట్ వర్క్ లో హాల్ చల్ చేస్తుంది.

ఇక నయీమ్ ఒక్క వ్యాపారస్తులను, రాజకీయ నాయకులను, బిల్డర్స్  ని బెదిరించి డబ్బులు వసూళ్లు చేసేవాడరి అంతే కాకుండా సినిమా ఇండస్ట్రీ వారిని కూడా బెదిరించి డబ్బులు వసూళ్లు చేశారని టాక్. అంతే కాదు పవన్ కళ్యాన్ నిర్మాతను బెదిరించి దాదాపు 8 కోట్ల వరకు వసూళ్లు చేసినట్లు సమాచారం. మరికొంత మంది నిర్మాతలను బెదిరించి డబ్బులు లాగాడని లేదంటే చంపేస్తానని బెదిరించినట్లు వార్తలు వచ్చాయి. అయితే నయీం అరాచకాలపై రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్నాయి. రాజకీయ నాయకులు.. పోలీసు అధికారులతో పాటు సినీ ప్రముఖులకు సైతం నయీంతో సంబంధాలున్నాయని.. ఇక్కడ చాలా మంది నయీం బాధితులు ఉన్నారని వెల్లడవుతోంది.

నయీంకు సినీ పెద్దలతో సంబంధాలపై కొన్ని రోజులుగా చాలా వార్తలు వస్తున్న.. ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ మాట్లాడింది లేదు. ఐతే ముందుగా నట్టి కుమారే పెదవి విప్పాడు. పరిశ్రమకు చెందిన పలువురు సీనియర్‌ నిర్మాతలు.. బడా బాబులతో నయీంకు గట్టి సంబంధాలు ఉన్నాయన్నాడు.  వివాదాస్పద నిర్మాత నట్టి కుమార్‌ నయీం గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. నయీం మనుషులు తనను బెదిరించి.. తన థియేటరును లాక్కున్నట్లు అతను వెల్లడించడం విశేషం.  

నటుడు, నిర్మాత సచిన్‌ జోషి ఓ గొడవకు సంబంధించి నయీం సహకారం తీసుకున్నాడని నట్టి కుమార్‌ ఆరోపించాడు. ఆంధ్రా ప్రాంతంలోని చాలా థియేటర్లలో నడిచే క్యాంటీన్లు నయీంకు చెందినవే అన్నాడు.  అక్రమాలకు కొదవే లేదని నయీం కు ఉత్తరాదితో పాటు కృష్ణా , గుంటూరు జిల్లా లలోని థియేటర్ లలో క్యాంటీన్ లన్నీ నయీం అధీనంలో ఉన్నాయని ఆరోపిస్తున్నాడు . నయీం హతం కావడంతో ఒక్కొక్కరుగా బాధితులంతా బయటకు వస్తున్నారు .



మరింత సమాచారం తెలుసుకోండి: