కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని యంగ్ హీరోలలో కొంచెం దూకుడుగా ఉండే హీరో విశాల్. విశాల్‌కు తెలుగులో కంటే తమిళంలో మంచి క్రేజ్ ఉంది. వరుస చిత్రాలను సక్సెస్ చేసుకుంటూ ఇండస్ట్రీలో తనదైన మార్కెట్ ని చేజిక్కించుకున్నాడు. ఇక సినిమా పరిశ్రమలో ఏదైనా అన్యాయం జరిగితే మొదటగా స్పందించేది విశాలే. అలాగే తమిళ ప్రజలకు ఏదైనా అత్యవసరసమయంలో సహాయం కావాలన్నా ఇండస్ట్రీ నుండి ముందుగా కదిలేది విశాలే.

గతంలో చెన్నైకి వరదలు వచ్చినప్పడు విశాల్ చేసిన సేవని చెన్నై ప్రజలు మరచిపోలేనిది. ఇదిలా ఉంటే తాజాగా విశాల్ ఓ హీరోయిన్ విషయంలో కాస్త నోరు జారుడు. తనపై కామెంట్ చేసే రైట్ నాకుంది అంటూ మాట్లాడటంతో ఇక్కడే కొంత ఇబ్బంది ఎదురయింది. ఇదంతా శరత్‌ కుమార్‌ తనయురాలైన హీరోయిన్ వరలక్ష్మి వ్యవహారంలో జరిగింది. హీరోయిన్ వరలక్ష్మీతో విశాల్ కి గత కొంత కాలంగా ప్రేమాయణం నడుస్తుందనేది కోలీవుడ్ ఓపెన్ సీక్రెట్.

దీనికి సంబంధించిన విషయంలో వీరిద్దరూ ఏనాడు బహిరంగంగా కామెంట్స్ చేసుకోలేదు. అయితే తాజాగా వరలక్ష్మీ తో మ్యారేజ్ కన్ఫర్మ్ అయిందంటూ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ కి దారితీస్తున్నాయి. పెద్దల అంగీకారం లేకుండానే తనపై విశాల్ కామెంట్ చేయటంతో ఈ బ్యూటీ ప్రస్తుతం కోపంగా ఉంది. తనపై కామెంట్ చేయాల్సిన అవసరం లేదని విశాల్ కి వరలక్ష్మీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టుగా ప్రస్తుతం కోలీవుడ్ లో టాక్స్ నడుస్తున్నాయి.

ఇదిలా ఉంటే త్వరలోనే విశాల్ పెళ్ళి ఉంటుందని మరి కొందరు అంటున్నారు. అందులోని భాగంగానే విశాల్, వరలక్ష్మీపై కామెంట్ చేసి ఉంటారని అంటున్నారు. ఏదైమైనా విశాల్ చేసిన కామెంట్స్ కి ప్రస్తుతం వరలక్ష్మీ కోపంగానే ఉందట. త్వరలోనే ఈ వ్యవహారం సద్ధుమణిగేలా విశాల్ చూసుకుంటారనేది ఇండస్ట్రీ ఇన్నర్ టాక్స్.


మరింత సమాచారం తెలుసుకోండి: