స్టార్ డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి. అయితే ఈ మూవీకి సంబంధించిన మొదటి భాగం పోస్ట్ ప్రొడక్షన్ ఉన్న సమయంలో...దాదాపు 20 నిముషాల వీడియో బయటకు వచ్చింది. దీంతో రాజమౌళి హడలిపోయాడు. ఈ పనిని చేసిన వారిని దాదాపు చంపేద్దాం అన్నంత కోపం తనకి వచ్చినప్పటికీ...తరువాత మాత్రం ఈ తరహా మిస్టేక్స్ రిపీట్ కాకుడదని నిర్ణయించుకున్నారు.

ఇప్పటికే రాజమౌళి 'బాహుబలి 2' మూవీకి సంబంధించిన షూటింగ్ పనులను చివరి దశకు తీసుకువస్తున్నారు. అలాగే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులకి సంబంధించిన పనులని సగం మేర పూర్తి చేసుకున్నారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులకి సంబంధించిన పనుల్లో రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాహుబలి2కి సంబంధించిన ఏ వర్క్ అయిన...తన కనుసన్నల్లోనే జరిగేలా ప్లాన్ చేసుకున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించిన ప్రతి వర్క్ ని సిసి కెమెరాల నడుమ నిర్వహిస్తున్నట్టుగా చిత్ర యూనిట్ నుండి అందుతున్న సమాచారం. బాహుబలి2కి పని చేస్తున్న ప్రతి ఒక్కరిపై రాజమౌళి టీం సమగ్ర పర్వవేక్షణ ఉందని అంటున్నారు. ఒకరకంగా చెప్పాలంటే రాజమౌళి తన బాహుబలి2 మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులపై అత్యంత బధ్రతని చూపిస్తున్నాడని అంటున్నారు.

కొన్ని సమయాల్లో ఎవరిపైనా అనుమానం వస్తే...వారికి టార్ఛర్ కనిపిస్తుందని అంటున్నారు. ఇక బాహుబలి2 మూవీకి సంబంధించిన సిజి ప్రాజెక్ట్స్ ని అవుట్ సోర్సింగ్ తీసుకున్న కంపెనీలకి...రాజమౌళి కఠిన నిభంధలను పెట్టారని అంటున్నారు. మొత్తంగా 'బాహుబలి' తొలిభాగం ప్రపంచ వ్యాప్తంగా సృష్టించిన సంచలన విజయం నేపథ్యంలో రెండో భాగం పై రాజమౌళి మరింత కేరింగ్ తీసుకోవటం..ఈ మూవీపై హైప్ ని క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ బిజినెస్ దాదాపు 400 కోట్ల రూపాయల చేయటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: