నిజ జీవిత ఘటనల ఆధారంగా సినిమాలు తీయడంలో క్రియేటివ్‌ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అందివేసిన చేయి.  ఇప్పటికే పరిటాల రవికి సంబంధించి ‘రక్త చరిత్ర’ రెండు భాగాలు గా తీశారు. ఆ మద్య బాలీవుడ్ లో బాల్ థాకరే పై ఓ సినిమా తీసినట్లు అంతే కాదు ఓ మాఫీయా లీడర్ పై కూడా సినిమా తీసిన సంగతి తెలిసిందే. అంతే కాదు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను గడ గడలాడించిన కిల్లర్ వీరప్పన్ నిజ జీవితం కథగా మలచి సినిమా తెరకెక్కించాడు. ఈ చిత్రం కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ మద్య కర్ణాటక కు చెందిన ఓ మాజీ డాన్ సినిమా తెరకెక్కిస్తున్నారు వర్మ. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన నయీమ్ పై కన్నుపడింది.

ఇటీవలే వీరప్పన్‌ జీవితకథతో అందరినీ మెప్పించిన వర్మకు మరో కథ దొరికేసిందట. అది మరెవరదో కాదు... దోపిడీలు, భూదందాలు, అకృత్యాలతో అందరూ విస్తుపోయేలా చేసిన గ్యాంగ్‌స్టర్‌ నయీం జీవిత కథ. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు సినిమాలు రానున్నాయని అంటున్నారు. నయీమ్‌ జీవిత కథను సినిమాగా తెరకెక్కించబోతున్నాడు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇలాంటి టాపిక్స్‌ ఎంచుకోవడంలో వర్మ తర్వాతే ఎవరైనా. ముంబై టెర్రర్‌ ఎటాక్‌ నేపథ్యంలో వర్మ అప్పట్లో తీసిన సినిమా ఘనవిజయం సాధించిన విషయం విదితమే. అక్కడ కొంత మంది డాన్ లు కూడా వర్మను బెదిరించినా తన పంతం మాత్రం మానలేదు.

నయీమ్‌కి సంబంధించినంతవరకు కథ చాలానే వుంది. తెలిసింది గోరంత.. తెలియాల్సింది కొండంత. కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగిన అతడి నేరాలు రోమాంచితంగా ఉన్నాయి. నక్సలైట్‌ నుంచి పోలీస్‌ ఇన్‌ఫార్మర్‌గా మారి తర్వాత అండర్‌వరల్డ్‌ గ్యాంగ్‌స్టర్‌గా మారిన నయీం భయంకరమైన క్రిమినల్‌. నయీం గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోదు పెద్ద సినిమానే తీయాలి. నయీమ్ స్టోరీ చాలా సంక్లిష్టంగా ఉంది. దీనిని ఒకే సినిమాలో చెప్పడం కష్టం. అందుకే నయీమ్ స్టోరీని మూడు భాగాలుగా చిత్రీకరించాలని నిర్ణయించా. రక్త చరిత్ర రెండు భాగాలుగానే వచ్చింది. నయీమ్ చిత్రం మాత్రం మూడు భాగాలుగా వస్తుంది’’ అని రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లలో వెల్లడించారు.

రాంగోపాల్ వర్మ ట్విట్ :

మరింత సమాచారం తెలుసుకోండి: