సిని పరిశ్రమలో ఓ హిట్ వస్తే ఓవర్ నైట్ స్టార్ అయిపోవడం కామనే.. ఇంతకుముందు ఎంతమంది అలాంటి హిట్ మజాను ఎంజాయ్ చేస్తి స్టార్ స్టేటస్ అందుకున్నారో. అయితే ఇప్పుడు హిట్ వస్తే స్టార్ ఇమేజ్ కన్నా అవకాశాల వెళ్లువ మొదలవుతుంది. ఈ మధ్యనే పెళ్లిచూపులు హిట్ తో టాక్ ఆఫ్ ది టౌన్ అయిన విజయ్ దేవరకొండ సినిమాతో సూపర్ హిట్ సాధించాడు.


తరుణ్ భాస్కర్ డైరక్షన్లో వచ్చిన ఈ సినిమాను రాజ్ కందుకూరి నిర్మించడం జరిగింది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన పెళ్లిచూపులు పెద్ద విజయాన్ని అందించుకోవడమే కాదు ఎవరు ఊహించని రెవిన్యూని కలక్షన్స్ రూపంలో తెస్తుంది. హిట్ సినిమాకు డైరక్టర్ ఎంత కారణం అయినా ఈ సినిమాకు విజయ్ దేవరకొండ తన ప్రశాంత్ రోల్ కు నూటికి నూరు శాతం న్యాయం చేశాడు.


అందుకే ఇప్పటిదాకా తన తర్వాత సినిమా ఏంటి అని ఎవరు కనీసం పట్టించుకోలేదు కాని పెళ్లిచూపులు హిట్ అయ్యే సరికి మనోడు తీస్తున్న తర్వాత సినిమా అర్జున్ రెడ్డి మీద అందరి చూపు పడ్డది. ఓ లిప్ లాక్ సీన్ ను రిహాల్సెల్స్ చేస్తూ చీప్ పబ్లిసిటీ అని తిట్టి పోసిన అర్జున్ రెడ్డి సినిమాను కొనేందుకు ఫ్యాన్సీ ఆఫర్లతో దర్శక నిర్మాతల చుట్టూ తిరుగుతున్నారట.


ఇదంతా పెళ్లిచూపులతో విజయ్ కొట్టిన హిట్ మహిమే.. ఇప్పటికే ఓవర్సీస్ లో 1 మిలియన్ మార్క్ టచ్ చేసిన ఈ సినిమా ఇక నుండి విజయ్ సినిమాలకు అక్కడ కూడా ఓ మార్కెట్ వచ్చేలా చేసింది. సో చూస్తుంటే కుర్ర హీరోలందరికి విజయ్ ఓ షాక్ ఇచ్చాడని చెప్పాలి. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో నాని ఫ్రెండ్ రోల్ లో మెప్పించిన విజయ్ పెళ్లిచూపులుతో సోలో హిట్ అందుకున్నాడు.


ఇక విజయ్ చేస్తున్న అర్జున్ రెడ్డి తర్వాత తనతో సినిమా తీసేందుకు దర్శక నిర్మాతలు కూడా వెంటపడుతున్నారు. ఏకంగా అశ్వనిదత్ లాంటి నిర్మాత విజయ్ తో సినిమాకు సిద్ధమయ్యాడంటే ఇక విజయ్ క్రేజ్ ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. మరి వచ్చిన ఈ పాజిటివ్ వైబ్స్ తో విజయ్ ఎలాంటి సినిమాలతో మన ముందుకు వాస్తాడో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: