ఇప్పటికే రిలీజ్ డేట్స్ లో అనేక సార్లు మార్పులు వచ్చిన ‘జనతా గ్యారేజ్ మరోసారి తన రిలీజ్ డేట్ ను మార్చుకుని ఆగష్టు 1న విడుదల కాబోతోంది అన్న విషయం తెలిసిందే.  ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన నేపధ్యంలో ఈ లేటెస్ట్ నిర్ణయం ‘జనతా గ్యారేజ్’ సినిమాకు ఎంత వరకు కలిసి వస్తుంది అన్న ఆలోచనల మధ్య జూనియర్ అభిమానులు రకరకాల లెక్కలు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వైపు అమావాస్య సెంటిమెంట్ మరో వైపు మరునాడు వచ్చే భారత్ బంద్ జూనియర్ అభిమానులను విపరీతం గా టెన్షన్ పెడుతున్నట్లు టాక్ .

అభిమానులు ఇలా టెన్షన్ పడటానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు.  ప్రస్తుతం టాప్ యంగ్ హీరోల సినిమాల కలక్షన్స్ రికార్డులను ప్రభావితం చేయడంలో ఓవర్సీస్ కలక్షన్స్ కీలక పాత్రను పోషిస్తున్నాయి.  ఈ నేపధ్యంలో ‘జనతా గ్యారేజ్’ మన తెలుగు రాష్ట్రాలలో ఆగష్టు 1న విడుదల అవుతోంది అంటే ఈసినిమా ప్రీమియర్ షోలు జూలై 31 రాత్రి అమెరికాలో పడిపోతాయి. 

అయితే ఈ ప్రీమియర్ షోలు పడిన తరువాత తదుపరి వచ్చే ఆగష్టు 1, 2వ తారీఖులు అమెరికాలో వర్కింగ్ డేస్.  మళ్ళీ వీకెండ్ ఫీవర్ 3, 4 తారీకులలో మాత్రమే అమెరికాలో కనిపిస్తుంది. ఈ నేపధ్యంలో ‘జనతా గ్యారేజ్’ ప్రీమియర్ షోల టాక్ లో ఏమైనా తేడా కనిపిస్తే వెంటనే దాని ప్రభావం ఆ తరువాత వచ్చే తదుపరి రోజుల కలక్షన్స్ పై ప్రభావం చూపెడుతుంది అన్న కామెంట్స్ జూనియర్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నట్లు టాక్.

గత సంక్రాంతికి విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’ కూడ జనవరి 13న విడుదల కావడంతో ఆ తరువాత వచ్చిన రోజులు అమెరికాలో వర్కింగ్ డేస్ కావడంతో ఈ సినిమా అనుకున్న రికార్డులను చేరలేక పోయింది అన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇది ఇలా ఉండగా మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆగష్టు 1 గురువారం కావడంతో ఇక్కడ కూడ వర్కింగ్ డే కావడంతో ఆ ఒక్కరోజు కలక్షన్స్ ను జూనియర్ క్రేజ్ కాపాడినా ఆ తరువాత వచ్చే 2వ తారీఖున  భారత్ బంద్ కావడంతో ఆ రోజు రవాణా సదుపాయాలు సరిగ్గా ఉండని నేపధ్యంలో సినిమాల కలెక్షన్స్ కూడ  బాగా   డల్ అవుతాయి.

దీనితో ‘జనతా గ్యారేజ్’  కలక్షన్స్ హవాకు మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఈసినిమా విడుదల అవుతున్న కేరళా తమిళనాడు రాష్ట్రాలలో కూడ బ్రేక్ పడే అవకాశం ఉంది.  ఈ బ్రేక్ నేపధ్యంలో అనుకోకుండా ‘జనతా గ్యారేజ్’  సినిమాకు డివైడ్ టాక్ వస్తే ఆ తరువాత వచ్చే వీకెండ్ కలక్షన్స్ విషయంలో మన తెలుగు రాష్ట్రాలలో కూడ ‘జనతా గ్యారేజ్’ కు ముప్పు పొంచి ఉంది అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

ఈ విశ్లేషణలు అన్నీ జూనియర్ అభిమానుల దృష్టి వరకు వెళ్ళడంతో ‘జనతా గ్యారేజ్’ ను ఆగష్టు 1న విడుదల ఎంత వరకు శ్రేయస్కరం అన్న ఆలోచనలలో జూనియర్ అభిమానులు టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది.  దీనికి తోడు ఈ సినిమా పాటలు మాస్ ప్రేక్షకులకు అంతగా రుచించలేదు అనే వార్తలు వస్తున్న నేపధ్యంలో ‘జనతా గ్యారేజ్’ ఆవష్టు 1న విడుదలైన తరువాత  మరుసటి రోజన బంద్ రూపంలో ద్వితీయ విఘ్నంను తట్టుకుని ఎంత వరకు కలక్షన్స్ విషయంలో సంచలనాలు చేయగలుగుతుంది అన్న లెక్కల మధ్య జూనియర్ అభిమానులు చాల బిజీగా ఉన్నట్లు టాక్..


మరింత సమాచారం తెలుసుకోండి: