చిరంజీవి పుట్టినరోజు అయిపోయి రెండు రోజులు పూర్తి అయినా ఇంకా ఆ పుట్టినరోజు విశేషాలు మీడియాకు హాట్ టాపిక్ గా కొనసాగుతూనే ఉన్నాయి.  చిరూ పుట్టినరోజునాడు పవన్ రాకపోయినా అతడి తరుఫున అతడి భార్య ప్రతినిధిగా వచ్చింది అంటూ ఫోటోలతో సహా సోషల్ మీడియాలో హడావిడి జరుగుతోంది. 

దీనితో చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా తమ అన్నదమ్ముల మధ్య మార్గాలు వేరు అయినా గమ్యం ఒకటే అన్న మాటలు అక్షర సత్యాలుగా మరాయి అంటూ కామెంట్స్ పడుతున్నాయి. చిరంజీవి అభిమానులతో ఏర్పాటు చేసిన ఫంక్షన్ కు వెళ్ళకుండా రహస్యంగా అదేరోజు రాత్రి హయ్యత్ హోటల్ లో ఏర్పాటు చేసిన పార్టీకి వెళితే అదే మార్గాన్ని అనుసరిస్తూ పవన్ రహస్యంగా అదే పార్టీకి తన భార్య అన్నా లేజినోవా ను పంపాడు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన సెటైర్లు పడుతున్నాయి.

వాస్తవానికి రేణు దేశాయ్ కు డైవర్స్ ఇచ్చేసి అన్నా లెజినోవా అనే రష్యన్  బోర్న్ సంతతికి చెందిన ఆస్ర్టేలియా అమ్మాయిని పవన్ పెళ్ళి చేసుకున్నట్లు చాల కాలం తరువాత వెలుగులోకి వచ్చింది.  ‘జనసేన’ స్థాపించిన కొత్తలో ఈ మ్యారేజ్ రిజిష్ట్రేషన్ డాక్యుమెంట్ బయటకు రావడంతో ఈ విషయం బయటకు పొక్కినా విషయం తెలిసిందే. 

అయితే పవన్ అన్నాలు ఇద్దరు కలిసి బయట కనిపించిన సందర్భాలు ఇప్పటి వరకు లేవు.  కానీ ఈమధ్య శ్రీజ పెళ్ళి ఫంక్షన్ లో కనిపించిన ఒక ఫారినర్ లేడీ అన్నా లెజినోవా అంటూ వార్తల హడావిడి జరిగింది. అయితే చిరంజీవి బెంగుళూరు ఫామ్ హౌస్ లో జరిగిన ఆ పెళ్ళి వేడుకకు  కేవలం స్నేహితులను బంధువులను మాత్రమే పిలిచారు కాబట్టి ఖచ్చితంగా  వచ్చిన ఫారిన్ లేడీ పవన్ వైఫ్ అయి ఉంటుందని అంచనాలు వేస్తూ అందరూ వార్తలు వ్రాసారు.

ఇప్పుడు లేటెస్ట్ గా జరిగిన మెగాస్టార్ 61వ బర్త్ డే సెలబ్రేషన్స్ లో ఆమె మళ్ళీ కనిపించడంతో  అన్నా లెజినోవా ఈజ్ బ్యాక్ అంటూ పవన్ రాకపోయినా ఆయన భార్య వచ్చింది అంటూ సోషల్ మీడియాలో జరిగిన రచ్చ అందర్నీ ఆశ్చర్య పరిచింది.  

అయితే కొందరు మాత్రం ఈమె పవన్ భార్య కాదు మరెవరో విదేశీ వనిత అంటూ ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు.  ఈ వార్తలలో ఎన్ని నిజాలు అన్న విషయాలు పక్కకు పెడితే అభిమానులకు తెలియకుండా చిరంజీవి రహస్యంగా పుట్టినరోజు డిన్నర్ ఫంక్షన్ కు వెళ్ళడం అదే విధంగా తన అన్న ఫంక్షన్స్ కు రాకుండా పవన్ తన భార్యను మెగా కుటుంబ ఫంక్షన్స్ కు పంపుతూ ఉండటం వంటి విషయాలకు సంబంధించిన వార్తలు చూస్తూ ఉంటే ఈ అన్నదమ్ములు ఇద్దరు ఎందుకు ఇలా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నారు అని అనిపించడం సహజం..  



మరింత సమాచారం తెలుసుకోండి: