నైజాంలో తిరుగులేని డిస్ట్రిబ్యూటర్ గా ఏలుతున్న దిల్ రాజుకి అభిషేక్ పిక్చర్స్ నుండి అనుకోని పోటీ ఎదురైంది రిస్క్ చేసి మరి దిల్ రాజుకి పోటీగా సినిమాలు కొంటున్న అభిషేక్ పిక్చర్స్ గట్స్ ను నిజంగా మెచ్చుకోవాల్సిందే. ఇప్పటికే దిల్ రాజుకి అన్నింట్లో పోటీ ఇస్తున్న అభిషేక్ పిక్చర్స్ ఈ మధ్యనే ప్రొడక్షన్ హౌజ్ కూడా స్టార్ట్ చేసింది.


ఒకేసారి ఐదు క్రేజీ సినిమాలతో నిర్మాతగా మారిన అభిషేక్ ఇప్పుడు ఇంకాస్త ముందడుగేసి ఓ ఆడియో సంస్థను కూడా పెడుతున్నాడట. ఏ మ్యూజిక్ అనే ఆడియో సంస్థను కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాడట అభిషేక్ పిక్చర్స్. ఓ పెద్ద హీరో సినిమాతో ఈ ఆడియో సంస్థను స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నాడు అభిషేక్ సంస్థల అధినేత అభిషేక్.


అయితే ఈ విధంగా రెచ్చిపోతున్న అభిషేక్ ను చూస్తుంటే దిల్ రాజు ఓ పక్క కడుపు మంటగా అనిపించడం మాములే. రీసెంట్ గానే డిస్ట్రిబ్యూటర్ గా వచ్చిన అభిషేక్ అంచెలంచలుగా ఎదుగుతూ ఇప్పుడు నిర్మాత, ఆడియో సంస్థను కూడా స్టార్ట్ చేయడం గొప్ప విషయం. ఇక స్టార్ హీరో సినిమాలనైతే పెద్ద మొత్తానికే కొని అభిషేక్ తన స్టామినా ఏంటో చూపిస్తున్నాడు. 


ఇక దిల్ రాజు కూడా ఈ మధ్య కాస్త స్పీడ్ పెంచాడు తాను డిస్ట్రిబ్యూటర్ గానే కాదు నిర్మాతగా కూడా వరుస సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే సెట్స్ మీద ఓ రెండు మూడు సినిమాలున్నాయి. అభిషేక్ దిల్ రాజుల మధ్య జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో చివరకు ఎవరు నెగ్గుతారో చూడాలి.


ప్రస్తుతం రాబోతున్న అన్ని స్టార్ హీరోల సినిమాలను అభిషేక్ పిక్చర్స్ ద్వారా రిలీజ్ అవుతుంటే. దిల్ రాజు చేతిలో జూనియర్ ఎన్.టి.ఆర్ నటించిన జనతా గ్యారేజ్ ఉంది. చాలా పెద్ద మొత్తంలో నైజాం రైట్స్ ను దక్కించుకున్నాడు దిల్ రాజు. మరి పోటీ బాగున్నా మరి రిస్క్ చేసి అసలకే మోసం వచ్చే పరిస్థితి తెచ్చుకోకుంటే బెటర్ అంటున్నారు సిని జనాలు.



మరింత సమాచారం తెలుసుకోండి: