నటుడు దర్శకుడు జె.డి చక్రవర్తి ఈ మధ్యనే ఎలాంటి హడావిడి లేకుండా హీరోయిన్ అనుకృతిని పెళ్లాడిన సంగతి తెలిసిందే. డైరక్టర్ రాం గోపా వర్మ దగ్గర శిష్యరికం చేసిన జెడి కొంతకాలం టాలీవుడ్ హీరోగా అలరించాడు. ఇక వర్మ బాలీవుడ్ బాట పట్టడంతో అక్కడ కూడా సినిమాలు చేశాడు. తెలుగులో జెడికి మంచి క్రేజ్ ఉండేది. అయితే ఇక తర్వాత హీరోగా మానేసి డైరక్టర్ గా టర్న్ అయ్యాడు జెడి చక్రవర్తి.


ఇప్పటిదాకా బ్యాచిలర్ గా ఉన్న జెడి సడెన్ గా అనుకృతిని పెళ్లాడి అందరికి షాక్ ఇచ్చాడు. మరి ఈ ఇద్దరి మధ్య పెళ్లి జరగడానికి కారణం ఏంటి అంటే వర్మ తీసిన సావిత్రి అదేనండి శ్రీదేవి అని హడావిడి చేసిన సినిమా అని తెలుస్తుంది. ఆ సినిమాలో జెడితో కలిసి నటించిన అనుకృతితో ఓ ఘాటు ముద్దు సీన్ ఉందట.


ఇక అక్కడ నుండి ఇద్దరి అభిరుచులు కలిసి ప్రేమించుకోవడం మొదలు పెట్టారట. సో వర్మ తీసిన సావిత్రి సినిమా ఎటెళ్లిందో తెలియదు కాని ఆ సినిమాతో అప్పటిదాకా మోడల్ గా ఉన్న అనుకృతి హీరోయిన్ అవ్వడమే కాదు జెడి చక్రవర్తి తనని పెళ్లి చేసుకునే రేంజ్ కు వెళ్లింది. ఇక సావిత్రి తర్వాత పాప అనే సినిమాకు ఓకే చెప్పిన అనుకృతి ఆ సినిమా దర్శకుడు తనని వల్గర్ గా ట్రీట్ చేస్తున్నాడని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది అనుకృతి.


ఏది ఏమైనా ఓ సినిమా వల్ల ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకోవడం మంచి విషయమే. మొన్నటిదాకా బ్యాచిలర్ గా ఉన్న జెడి ఆ లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టి అనుకృతిని పెళ్లాడటం అందరిని ఆశ్చర్యపరచింది. అయితే వీరి పెళ్లిపై వర్మ ఎలాంటి కామెంట్ చేయకపోవడం విశేషం. మరి జెడి ఫీల్ అవుతాడని చేయలేదో మరే కారణమో తెలియదు కాని జెడి పెళ్లి చేసుకున్న న్యూస్ గురించి నోరు కూడా విప్పలేదు రాం గోపాల్ వర్మ.


కెరియర్ లో చాలామంది స్టార్ హీరోయిన్స్ తో నటించిన జెడి అనుకృతికి పడిపోవడం కూడా ఆశ్చర్యపడుతున్నారు. తన సినిమాలో హాట్ ఇమేజ్ ఉన్న అమ్మడిని తన అర్ధాంగిగా చేసుకున్న జెడి చూసి అందరు మంచి పని చేశాడంటూ మెచ్చుకుంటున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: