తెలుగు బుల్లితెరపై తన మధురమైన గానంతో ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసుదోచిన గాయని శొంఠి గీతామాధురి.  చిన్న చిన్న ప్రోగ్రామ్స్ లో పాటలు పాడుతూ అంచెలంచెలుగా పైకి వచ్చిన గీతా మాధురి ఇప్పుడు బెస్ట్ సింగర్ గా పేరు తెచ్చుకుంది. కులశేఖర్ దర్శకత్వం వహించిన ప్రేమలేఖ రాశా సినిమాలోని ఒక పాటతో ఆమె సినీ రంగప్రవేశం చేశారు.నచ్చావులే(2008) సినిమాలో ఆమె పాడిన నిన్నే నిన్నే పాటతో ఎంతో పాపులర్ అయ్యింది. గీతా మాధురి తల్లిదండ్రులు ప్రభాకర్, లక్ష్మిలకు ఏకైక సంతానం..ఆమె తండ్రి స్బీహెచ్ బ్యాంక్ ఉద్యోగి.
Image result for geetha madhuri
గోదావరి ప్రాంతానికి చెందిన గీతా ఫ్యామిలీ చిన్నప్పుడే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యింది.  మాధురిది ప్రాథమిక విద్య హైదరబాద్, వనస్థలిపురంలోని లయోలా పాఠశాలలో చదువుకున్నారు.  చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టపడేది. అందుకే చిన్నప్పట్నుంచే ఆమె సంగీతం అభ్యసించడం మొదలుపెట్టారు.  లిటిల్ మ్యుజిషియన్స్ అకాడమీలో కచ్చర్లకోట పద్మావతి, రామాచారిల వద్ద చిన్న వయసు నుండే శాస్త్రీయ, సినీ, లలిత సంగీతాలలో శిక్షణ పొందారు గీత. ఈటీవిలో ప్రసారమైన "సై సింగర్స్ ఛాలెంజ్ "లో ఆమె ఫైనలిస్ట్ గా నిలిచింది.
Image result for geetha madhuri marriage pictures
ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాటలు పాడిన మాధురి వివాహం కూడా తన ఇష్టమైన వాడితోనే జరిగింది.  టాలీవుడ్ లో సైడ్ హీరోగా వేస్తున్న   ఆనంద కృష్ణ నందు గీతా 9 ఫిబ్రవరి 2014లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలసి అదితి అనే లఘు చిత్రం(షర్ట్ ఫిలిం)లో కథానాయకుడు, కథానాయికగా నటించారు. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటన్న గీతా మాధురికి ఏపీహెరాల్డ్. కామ్ తరుపునుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు. 


మరింత సమాచారం తెలుసుకోండి: