ఇండియాలో ఏదైనా క్రైమ్ బయటకు వచ్చిందంటే ముందుగా అక్కడ సమాచారాన్ని కనుక్కున్నేది  రామ్ గోపాల్ వర్మనే. ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఏ డైరెక్టర్ సైతం వర్మకి ఉన్న ఇంట్రెస్ట్ ఉండదు. అందుకే గతంలో ‘రక్త చరిత్ర, వీరప్పన్,26/11’ వంటి చిత్రాలను తీసి సంచలనం సృష్టించాడు. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన విధానం ప్రేక్షకులనే కాకుండా…సాధారణ ప్రజలను సైతం కట్టిపడేస్తుంది. ఇక వర్మ తెరకెక్కించే రియల్ క్రైమ్ స్టోరీలపై రాజకీయనాయకులు సైతం హడలిపోవటం జరుగుతుంది.


ఇదిలా ఉంటే ప్రస్తుతం వర్మ కన్ను దేశవ్యాప్తంగా సంచలనం రేపిన గ్యాంగ్ స్టర్‘నయీముద్దీన్’ పై పడింది. కొద్ది రోజుల క్రితమే నయీముద్దీన్ ను తెలంగాణా గ్రేహౌండ్స్ పోలీసులు ఎంకౌంటర్ చేసిన విషయం తెలిసిందే.  నయీముద్దీన్ గురించి బయటకు వచ్చిన నిజాలు చూస్తుంటే…ఎవ్వరూ నమ్మలేని విధంగా ఉన్నాయి. దీంతో వర్మ చూపు నయీముద్దీన్ లైఫ్ స్టోరీ పై పడింది. అతని జీవితాన్ని ఒక్క సినిమాగా తీయడం కష్టంగా భావించిన వర్మ 3 భాగాలుగా తీయాలనుకుంటున్నాను చెప్పుకొచ్చారు.


ప్రస్తుతం సర్కార్ 3 పనుల్లో బిజిగా ఉన్న వర్మ కొద్ది నెలల తరువాత నయీముద్దీన్ సినిమాని తెరకెక్కించనున్నారని అంటున్నారు. అయితే ఇండస్ట్రీ నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం…వర్మ తెరకెక్కించబోతున్న గ్యాంగ్ స్టర్ నయీముద్దీన్ పాత్రలో సునీల్ ని తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇప్పటికే కమెడియన్ నుండి హీరోగా మారిన సునీల్ కి ఇండస్ట్రీలో తన కంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని సంపాదించుకున్నాడు.


ఇప్పుడు వర్మ చిత్రంలో నటిస్తే…భవిష్యత్ ఎలా ఉంటుంది? అనేది ఊహించటం సునీల్ కి కొంచెం కష్టం అని అంటున్నారు. ఎందుకంటే సునీల్ ఒకవేళ నయీముద్దీన్ సినిమాలో నటించిన తరువాత టాలీవుడ్ ఇండస్ట్రీ తనని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుందనేది పెద్ద ప్రశ్న. ఇప్పుడు వర్మ ఇచ్చిన ఆఫర్ ని సునీల్ అంగీకరించాలా? లేదా? అనేది తనకి డైలమాలో ఉందనేది ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం. ఇక నయీముద్దీన్ గెటప్ కి సునీల్ కెరెక్ట్ గా సరిపోతాడు అని వర్మ భావించారంట. దీనిపై మరిన్ని వివరాలు త్వరలోనే బయటకు రానున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: