టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నందమూరి బాల‌కృష్ణ, మెగాస్టార్ చిరంజీవిల స్థానాన్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేనిది. గతంలో వీరిద్దరి సినిమాలు బాక్సాపీస్ వద్ద హోరాహోరీగా పోటీపడ్డాయి. నిజానికి ఫ్యాషన్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన హీరో బాల‌కృష్ణ అని చెప్పవచ్చు. తరువాత అదే బాటలో లేక్కలేనన్ని చిత్రాలు ఇండస్ట్రీలో వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఇండస్ట్రీలోని హీరోలందరికి గ్రాండ్ గా పార్టీ ఇచ్చారు.


ఈ మధ్య కాలంలో ఈ తరహా పార్టీని ఏ పెద్ద హీరో ఇవ్వలేదు. గతంలోనూ చిరంజీవి కొంత మంది హీరోలకి మాత్రమే పార్టీని ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కానీ…ప్రత్యేక సందర్భాల్లో ఎప్పుడూ ఇండస్ట్రీ హీరోలకి పార్టీని ఇవ్వలేదు. కానీ తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోల నుండి చిన్న హీరోల వరకూ…అలాగే స్టార్ హీరోయిన్స్ కి చిరు ప్రత్యేక వింధుని ఏర్పాటే చేశారు. నిజానికి ఈ విధంగా చేయటం వలన ఇండస్ట్రీలో హెల్థీ వాతావరణం ఏర్పడుతుంది.


ఈ పార్టీకి హాజరయిన స్టార్ హీరోలలో ప్రిన్స్ మహేష్ బాబు లాంటి వారు ఉండటం విశేషం. చిరు బర్త్ డే వేడుకలకి వచ్చిన ప్రిన్స్…చిరుని ఉద్ధేశించి మాట్లాడిన మాటలు ఇండస్ట్రీకి సైతం ఆశ్ఛర్యాన్ని ఇచ్చాయి. ‘ఖైదీ నంబ‌ర్ 150’ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ లో చిరు లుక్స్ సూప‌ర్ గా ఉన్నాయ‌ని, ఆ పోస్ట‌ర్ చూస్తుంటే త‌న‌కు ఠాగూర్ లో చిరంజీవి గుర్తుకు వస్తున్నారని మ‌హేష్ చెప్పుకొచ్చారట. ఇక నెటిజెన్స్ ఈ పార్టీని ఉద్ధేశించి కొన్ని కామెంట్స్ చేస్తున్నారు.


నందమూరి హీరో సైతం ఒక ప్రత్యేక సందర్భంలో ఇండస్ట్రీలోని హీరోలందరి ప్రత్యేక వింధుని ఏర్పాటు చేస్తే…ఇండస్ట్రీ వాతావరణం కుటుంబ సభ్యుల వాతావరణంగా మారుతుందని భావిస్తున్నారు. ఇక బాలయ్య కంటే ముందుగా చిరు ఈ తరహా పార్టీ ఇవ్వటంతో…బాలయ్య చేయలేని పనిని చిరు చేశాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదైమైనా చిరంజీవి ఇచ్చిన పార్టీకి ఇండస్ట్రీలో హీరోలు ఫిధా అయ్యారని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: