‘జనతా గ్యారేజ్’ రిలీజ్ డేట్ ప్రకటింప బడటంతో ఈసినిమా క్రియేట్ చేయబోతున్న రికార్డులు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి అన్న చర్చలు ఫిలింనగర్ లో ఊపు అందుకున్నాయి. ఈసినిమా క్రియేట్ చేయబోతున్న రికార్డులకు జరుగుతున్న పరిణామాలు కూడ బాగా కలిసి వస్తున్నట్లుగా కనిపిస్తోంది.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమా విడుదల అయ్యే మొదటిరోజు సెప్టెంబర్ 1న నైజాం ప్రాంతంలోని అన్ని ధియేటర్లలోను ‘జనతా గ్యారేజ్’ టిక్కెట్ రేటును 120 రూపాయల ఫ్లాట్ రేటుకు అమ్మడానికి ఈ సినిమాను నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న దిల్ రాజ్ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఆ సినిమాను ప్రదర్శింప బోతున్న ఎగ్జిబ్యూటర్లకు ఇప్పటికే ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి.

అదేవిధంగా ఈసినిమాను సీడెడ్ ఆంధ్రాప్రాంతాలలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న పంపిణి దార్లు కూడ ‘జనగా గ్యారేజ్’  మొదటి రోజు టికెట్ రేటును యూనిఫామ్ గా ఉండే విధంగా 100 రూపాయలకు ఫిక్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.  దీనిని బట్టి చూస్తూ ఉంటే ‘జనతా గ్యారేజ్’ ఏకంగా ‘బాహుబలి’ తొలిరోజు ఓపెనింగ్ కలక్షన్స్ 23 కోట్ల ఫిగర్ ను టార్గెట్ చేసే విధంగా ‘జనతా గ్యారేజ్’ ఎత్తుగడలు ఉన్నాయి అన్న వార్తలు వస్తున్నాయి.

అయితే ‘బాహుబలి’ రికార్డులు ఎలా ఉన్నా ‘జనతా గ్యారేజ్’  గత సమ్మర్ కు వచ్చిన పవన్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఓపెనింగ్ డే ఫిగర్ 21.6 కోట్లు దాటడం ఖాయం అని అంటున్నారు.  మొదటిరోజు కలక్షన్స్ విషయంలో ఎలా ఉన్నా ఈ సినిమా విషయంలో ఏమైనా డివైడ్ టాక్ వస్తే దాని ఫలితం రెండవ రోజు నుండి ధియేటర్ల వద్ద కనిపించే ప్రభావం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా కేవలం తన ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా 1 మిలియన్ తాలర్లు వసూలు చేసి మరో షాకింగ్ రికార్డును నెలకొల్పాలని ఈసిన్మా దర్శక నిర్మాతలు చాల పట్టుదలగా ఉన్నట్లు టాక్. జూనియర్   ‘నాన్నకు ప్రేమతో’ తన ప్రీమియర్ షోల ద్వారా 355321 డాలర్లు  వసూలు చేస్తే ఈసారి ‘జనతా గ్యారేజ్’ కనీసం 600000 డాలర్లను వసూలు చేయడమే ధ్యేయంగా ‘జనతా గ్యారేజ్’ ఓవర్సీస్ ప్రీమియర్  షోలు మారబోతున్నాయి అన్న అంచనాలు వేస్తున్నారు. 

అయితే కలెక్షన్స్ విషయంలో రకరకాల లెక్కలు ఇప్పుడు కాగితాల పై కనిపిస్తూ ఉన్నా ఈసినిమా అసలు టాక్ బయటపడిన తరువాత ఈ లెక్కల స్వరూపం పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది..   


మరింత సమాచారం తెలుసుకోండి: