మెగాస్టార్ పుట్టిన రోజు వేడుకల్లో అభిమానుల మధ్య కేక్ కట్ చేయడానికి రాలేదు కాని సెలబ్రిటీస్ తో పార్టీ జరుగుకునేందుకు చిరు వచ్చాడు. అది పక్కన పెడితే చిరు బర్త్ డే వేడుకల్లో పవర్ స్టార్ లేని లోటు కనిపించింది. అఫ్కోర్స్ మెగా ఈవెంట్ లంటే పవన్ రాడనుకోండి. కాని మెగాస్టార్ బర్త్ డే పార్టీకి అదేనండి సెలబ్రిటీ పార్టీకి స్వయంగా చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ కు ఫోన్ చేసి ఇన్వైట్ చేశాడట.


మరి ఇంటికెల్లి పిలవలేదని రాలేదో మరో కారణమో కాని పవన్ మాత్రం మళ్లీ చిరు పార్టీకి డుమ్మా కొట్టేశాడు. ఇక చరణ్ పిలిచాడో లేదో సూపర్ స్టార్ మహేష్ ఆ పార్టీలో అటెండ్ అయ్యి అందరికి సర్ ప్రైజ్ ఇచ్చాడు. మెగా హీరోలతో సన్నిహితంగా ఉంటూనే మెగాస్టార్ తన అభిమాన నటుడని చెప్పే మహేష్ బర్త్ డే ఇన్విటేషన్ అందగానే పార్టీలో పాల్గొన్నాడు.


మరి పిలవగానే వచ్చిన మహేష్ అందరి మనసులను గెలుచుకోగా అభిమానుల వేడుకకు రాని పవన్ కనీసం నైట్ సెలబ్రిటీ పార్టీలో అయినా కనబడి విష్ చేసి ఉంటే బాగుండేది అని కొందరి మాట. అయితే అందరు అనుకున్నట్టు చేస్తే అది పవర్ స్టార్ ఎలా అవుతాడు చెప్పండి అని కొందరు సెటైర్స్ కూడా వేస్తున్నారు.


మెగా ఈవెంట్ లో పవర్ స్టార్ కేకలు రాకుండా జాగ్రత్తపడిన మెగా హీరోలు ఆ తర్వాత జరిగిన మెగ సెలబ్రిటీ పార్టీలో పవన్ వస్తే బాగుండు అని ఆకాంక్షించారు. కాని పవన్ మరోసారి డుమ్మా కొట్టి తన రూటే సెపరేటు అని తెలియచెప్పాడు. మరి ఇన్విటేషన్ అందినా రాకుండా ఎప్పుడైనా కదిలిస్తే అన్నయ్య నాకు అది ఇది అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం ఎంతవరకు కరెక్టో ఆలోచించాలి.


ఇక మెగా ఫంక్షన్స్ కు రాని పవన్ తన అభిమాని నితిన్ ఆడియోకి, తన దర్శకుడు త్రివిక్రం అభిమానంతో పిలిచే ప్రతి కార్యక్రమానికి అటెండ్ అవుతాడు. మరి పవన్ ఫాలో అవుతున్న ఈ వ్యవహార శైలి అర్ధం చేసుకుకోవడం ఫ్యాన్స్ వల్ల కూడా కావట్లేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: