గత కొంత కాలంగా టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, బుల్లితెరలోనూ హంగామా క్రియేట్ చేస్తున్న టీం “జబర్ధస్త్” టీం. ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న ఈ కామెడీ షో ద్వారా పలువురు ఆర్టిస్ట్ లు కమెడియన్స్ గా ఫిల్మ్ ఇండస్ట్రీలో అవతారం ఎత్తారు. ఈ ఎఫెక్ట్ కొంత మంది సీనియర్ కమెడియన్స్ పై బాగానే పడిందని అంటున్నారు. ముఖ్యంగా బ్రహ్మానందంకి ఆఫర్స్ తగ్గాయనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్. దీనికి సంబంధించిన టాక్స్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్నాయి.


అయితే తాజాగా ఓ ప్రవేట్ ఫంక్షన్ కి హాజరు అయిన బ్రహ్మానందంని ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాత పలకరించి...మాటల మధ్యలో “జబర్ధస్త్” ఆర్టిస్ట్ ల గురించి ప్రస్థావన తెచ్చారంట. బ్రహ్మానందం సైతం “జబర్ధస్త్”షో పై ఫైర్ అయినట్టు సమాచారం తెలుస్తుంది. అయితే బ్రహ్మానందం “జబర్ధస్త్” పై ఫైర్ అనేది పక్కన పెడితే..తను ఈ షోలోని ఆర్టిస్ట్ లపై ఏ మాత్రం నెగిటివ్ కామెంట్ చేయలేదట. ఇదే ఆశ్ఛర్యాన్ని కలిగించింది.


ఎవరో కావాలనే “జబర్ధస్త్”షో ద్వారా తనకి ఆఫర్స్ తగ్గిపోతున్నాయని కామెంట్స్ చేస్తున్నారని. ఇది కరెక్ట్ కాదని తను చెప్పుకువచ్చారు. ఎవరో కావాలనే తనపై బ్యాడ్ గా పబ్లిసిటీ ఇస్తున్నారని చెప్పుకొచ్చారంట. మొత్తంగా “జబర్ధస్త్” ద్వారా ఆఫర్స్ తగ్గిపోతున్నాయని వస్తున్న టాక్స్ పై బ్రహ్మానందం వివరణ ఇచ్చుకోవటంతో ఇది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.


నిజానికి బ్రహ్మనందం గతంలో  వచ్చిన ప్రతి చిత్రంలో కనిపించేవారు. ఇప్పుడు మాత్రం అలా కాకుండా చాలా కొద్ది చిత్రాలలో కనిపించటం జరగుతుంది. ఇందుకు ఉన్న కారణాలు వేరే ఉన్నప్పటికీ... “జబర్ధస్త్” ఆర్టిస్ట్ లు మాత్రం కాదు అని తాజాగా తెలిసింది.



మరింత సమాచారం తెలుసుకోండి: