ముందు సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసి ఆ తర్వాత బుల్లితెర మీద జబర్దస్త్ షోతో మంచి పాపులారిటీ సంపాదించిన రష్మి ఆ క్రేజ్ తో మళ్లీ సినిమాల్లో రాణించాలనే ఉద్దేశంతో ఈసారి బోల్డ్ ఇమేజ్ తో ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో చేసిన గుంటూర్ టాకీస్ శృంగార ప్రియులను ఎంతగానో ఆకట్టుకోగా రష్మిని మాస్ ఆడియెన్స్ కు బాగా దగ్గర చేసింది.


క్యూట్ గా కనిపించే అమ్మడు హాట్ షో చేస్తే ఎలా ఉంటుంది. రష్మి కూడా అంతే ఉన్నంత కాలం ఏదో ఒక రకంగా క్రేజ్ తెచ్చుకుని డబ్బు సంపాదించాలని కాస్త పట్టు విడిచి సిగ్గు లేకుండా హాట్ షోలతో అదరగొట్టేస్తుంది. అయితే తన స్కిన్ షో చూసి నచ్చిన వారు ఎంజాయ్ చేస్తున్నా మరికొందరు ఛీ అనేస్తున్నారు. ఇక ఆ టైంలో తనతో చాట్ చేసిన ఓ అభిమాని మీరు ఈ బీ గ్రేడ్ సినిమాలు మానేసి కాస్త మంచి సినిమాలు చేయొచ్చుగా అనేశాడట.


ఇక ఇలాంటి కామెంట్స్ ఎన్నో విన్న రష్మి నువ్వు ప్రోడ్యూస్ చేస్తే అలానే నటిస్తా అంటూ రిప్లై ఇచ్చిందట. హీరోయిన్ అవ్వాలనే డ్రీంతోనే సినిమాల్లోకి వచ్చిన రష్మి మొదట్లో కేవలం సపోర్టింగ్ రోల్స్ కే పరిమితమయ్యింది. ఇక ఇలా కాదని తెగించేసి జబర్దస్త్ తో వచ్చిన పాపులారిటీతో గ్లామర్ షో చేయడం మొదలు పెట్టింది. అమ్మడు చేసిన హాట్ షో దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.


అయితే హీరోయిన్ గా చేస్తున్న తనకు మంచి అవకాశాలొస్తే కచ్చితంగా చేస్తానని తను ఇచ్చిన రెస్పాన్స్ తోనే అర్ధం అవుతుంది. మరి రష్మిని అంత మంచి క్యారక్టర్ లో చూపించే దర్శకుడు ఎవరో చూడాలి. ఈ మధ్యనే రిలీజ్ అయిన రష్మి అంతం, రాణి గారి బంగ్లా సినిమాల్లో కూడా అమ్మడు తన అందాలను ప్రేక్షకుల ముందు ఉంచింది.  


ప్రస్తుతం తను వచ్చెనంట సినిమా చేస్తున్న రష్మి ఇకనుండైనా ఓ మంచి రోల్స్ చేసేందుకు ప్రయత్నం చేస్తుందేమో చూడాలి. ఇక ఓ పక్క జబర్దస్త్ లో మస్త్ మస్త్ గా తన యాంకరింగ్ హవా కొనసాగిస్తున్న రష్మి ఈ క్రేజ్ తోనే కాసిన్ని రాళ్లు వెనుకేసుకోవాలని చూస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: