సురేష్ ప్రొడక్షన్ అధినేత సురేష్ బాబు తాను సినిమాలు ఎందుకు తీయట్లేదో తేల్చి చెప్పేశాడు. తనకు నచ్చని కథలతో వస్తున్న దర్శక నిర్మాతల మీద నమ్మకం లేకనే తాను సినిమాలు చేయట్లేదని ఆయన అంటున్నారు. రామానాయుడు గారు స్థాపించిన సురేష్ ప్రొడక్షన్ లో మూవీ మొఘల్ ఉన్నప్పుడే సురేష్ బాబు స్మార్ట్ డెశిషన్స్ తో సినిమా రిలీజ్ కు ముందే ఫలితాన్ని అంచనా వేసేవారు.


ఇక తను నిర్మించే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకునే వారు. అయితే కొద్ది సంవత్సరాలుగా సురేష్ ప్రొడక్షన్ నుండి ఇదవరకు వచ్చినన్ని సినిమాలు రావట్లేదు దానికి కారణం తనకు నచ్చే కథలతో ఎవరు రావట్లేదట. ఇక సినిమా ఫలితం విషయంలో తనకో ఆలోచన ఉందని రిలీజ్ ముందే సినిమా హిట్టా ఫట్టా అన్న విషయం తనకు తెలుస్తుందని అన్నారు.


అంతేకాదు తన తనయుడు చేసిన నేను నా రాక్షసి పూరి డైరక్షన్లో వచ్చింది.. ఆ సినిమా ఆడదని ముందే చెప్పాడట సురేష్ బాబు కాని రానా పట్టుపట్టడంతో చేశామని అది పోయిందని. ఇక ఆ తర్వాత నా ఇష్టం కూడా అదే ఫ్లాప్ ఫలితం ఇస్తుదని చెప్పినా అది కూడా రానా వల్లే చేశామని అన్నారు.


సో తన డెశిషన్ పక్కన పెట్టి చేసిన రెండు సినిమాలు ఇవే కాకుండా చాలా సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో నచ్చిన కథ వస్తేనే ఎలాంటి కాంప్రైజ్ కాకుండా నిర్మించేందుకు తాను ఓకే అంటున్నాడు. అయితే సురేష్ బాబు నిర్మాతగానే కాకుండా దర్శకులు చెప్పిన కథను కమర్షియల్ ఫ్లేవర్ కోసం కొన్ని సలహాలిస్తారట. అవి పాటిస్తేనే తనతో సినిమా చేయాలని చెబుతాడట.


ఇలానే కృష్ణవందే జగద్గురుం సినిమా అసలైతే సురేష్ బాబు ప్రొడక్షన్ లో చేయాల్సింది కాని బాబు గారి  ఇన్వాల్వ్ మెంట్ ఎక్కువగా ఉంటుంది అని తెలిసిన క్రిష్ స్వతహాగా నిర్మించుకున్నాడు. రీసెంట్ గా పెళ్లిచూపులు సినిమా తన మనసుకి నచ్చబట్టే తాను రిలీజ్ చేశానని అన్నారు. ఓ విధంగా పెళ్లిచూపులు ఈ రేంజ్ హిట్ అయ్యింది అంటే అది కచ్చితంగా సురేష్ బాబు రిలీజ్ చేయబట్టే అనాలి.   



మరింత సమాచారం తెలుసుకోండి: