పవన్ చాలా సున్నితమైన మనస్థత్వం కలిగిన వ్యక్తి.  ఇలాంటి పరిస్థితులలో తన అభిమాని వినోద్ హత్యకు గురికావడం పై పవన్‌కళ్యాణ్‌ తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ అభిమాని  కర్ణాటకలోని కోలార్ లో హత్యకు గురి కాబడిన సంఘటన మూడు రోజుల క్రితమే జరిగినా ఈవార్త ఆలస్యంగా నిన్నటి నుంచి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. 

కోలార్ లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న వినోద్‌ పవన్ వీరాభిమాని మాత్రమే కాకుండా తిరుపతి లో ‘జనసేన’ కార్యక్రమాలలో బాగా చురుకుగా పాల్గొన్న కార్యకర్త. ఈ వ్యక్తి మరోహీరో అభిమాని చేతుల్లో హత్యకు గురి కాబడటం షాకింగ్ న్యూస్ గా మారిన విషయం తెలిసిందే.  

వాస్తవానికి కోలార్ లో అవయవదానం పై అవగాహన కోసం ఏర్పాటు చేసింన కార్యక్రమంలో పాల్గొనడానికి వినోద్ కర్ణాటక వెళ్ళినట్లు తెలుస్తోంది.  ఈ కార్యక్రమానికి  సినీ
నటుడు సుమన్‌ కూడ అతిథిగా వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమం ముగిశాక వినోద్‌ తిరిగి వచ్చేస్తుండగా అప్పటికే వినోద్‌తో గొడవపడ్డ మరో హీరో అభిమానులు అతన్ని దారుణంగా కొట్టడమే కాకుండా కత్తులతో అతని పై దాడిచేచయడంతో వినోద్‌ కు తీవ్రంగా గాయం అయింది. 

ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడి చేసింది జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులనే ప్రచారం జరుగుతోంది. ఈ వార్తల వివరాలు తెలుసుకున్న పవన్‌కళ్యాణ్‌ తిరుపతికి వెళ్ళి మృతి చెందిన అభిమాని కుటుంబాన్ని పరామర్శించేందుకు సమాయత్తమావుతున్నట్లు  వార్తలు వస్తున్నాయి. 

ఇది ఇలా ఉండగా వినోద్‌ అంత్యక్రియలు నిన్న తిరుపతిలో జరిగాయి. వినోద్‌ అంత్యక్రియల్లో పెద్ద ఎత్తున పవన్‌కళ్యాణ్‌ అభిమానులు పాల్గొన్నారు. మరోపక్క విశాఖలో పవన్‌కళ్యాణ్‌ అభిమానులు ఆందోళనకు దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ సంఘటన పై విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలనిపవన్ అభిమానులు  డిమాండ్‌ చేస్తున్నారు.   

వినోద్‌ పై దాడి చేసిన అక్షయ్‌కుమార్‌ అనే వ్యక్తిని ఇప్పటికే కర్నాటక పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. హీరోల మధ్య ఎలాంటి విభేదాలూ వఉండక పోయినా హీరోలను అభిమానించే వీరాభిమానులు ఇలా తమ విలువైన జీవితాలను ఎందుకు నాశనం చేసుకుంటున్నారో ఎవరికీ అర్ధం కాని ప్రశ్నగా  మారింది.  ఒక  నిండు ప్రాణం ఇలా అభిమానం పేరుతో బలైపోవడం విషయం పై పవన్ తన అభిమానుల్ని ఉద్దేశించి ఈ రోజు ఎటువంటి మెసేజ్‌ ఇస్తాడో అన్న ఆసక్తి అందరిలోను ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: