‘బాహుబలి’ కి సంబంధించిన ప్రశ్న కట్టప్పను ‘బాహుబలి’ ఎందుకు చంపాడు? ఈ  ప్రశ్న  గురించిన  సస్పెన్స్ ‘బాహుబలి 2’ పై క్రేజ్ ను పెంచుతోంది. సామాన్య ప్రేక్షకుల దగ్గర నుంచి టాప్ వ్యక్తుల వరకు  రాజమౌళి ఈ ప్రశ్నకు ఎటువంటి సమాధనం చెప్పబోతున్నాడు అన్న ఆత్రుత పెరిగి పోతోంది. ‘బాహుబలి’ క్లైమాక్స్ సీన్స్ ను చిత్రీకరిస్తున్న రాజమౌళి ఈమధ్యనే కట్టప్ప ‘బాహుబలి’ ని చంపిన విషయానికి సంబంధించిన సీన్ చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ సినిమాకు సంబంధించిన ఈ అతి రహస్యం బట్ట బయలు కాకుండా ఈ సీన్ చిత్రీకరణ  విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ రహస్యం ముగ్గురికి లీక్ అయింది అని తెలుస్తోంది. ఈ సన్ని వేశంలో నటంచిన హీరో ప్రభాస్ అదేవిధంగా సత్యరాజ్ ల మధ్య  రాజమౌళి చాలా తెలివిగా ఈ సన్నివేశాన్ని చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి.  చాలా తక్కువ మంది యూనిట్  సభ్యుల మధ్య  ఈ సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు టాక్.

తీస్తున్న సీన్ కట్టప్ప ‘బాహుబలిని’ చంపింది అని హింట్ ఇవ్వకుండా రాజమౌళి  ముక్కలు ముక్కలుగా ఈసీన్ చిత్రీకరించి ఏకంగా ప్రభాస్ సత్యరాజ్ లను కూడ అయోమయంలో పడేసినట్లు తెలుస్తోంది.  ‘బాహుబలి 2’ సక్సస్ కు అత్యంత కీలకమైన ఈ సీన్ చిత్రీకరణ చాల గుంభనంగా చిత్రీకరించి వందల కోట్ల వ్యాపారంతో ముడిపడిన ఈ సీన్ పూర్తి వివరాలు బయట పడకుండా జాగ్రత్తలు తీసుకున్న ఈ సీన్ అసలు విషయం సత్యరాజ్ ప్రభాస్ నిర్మాత శోభూ యార్లగడ్డలకు ఇంచుమించు అర్ధం అయిపోయింది అని అంటున్నారు.

ఇది ఇలా ఉండగా ‘బాహుబలి 2’ సినిమాను లీకుల సమస్య నుండి రక్షించడానికి  రాజమౌళి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.  టాలీవుడ్ బాలీవుడ్ ఇలా తేడా లేకుండా దేశం మొత్తం రాజమౌళి ‘బాహుబలి 2’ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్న నేపధ్యంలో బాహుబలి 2 కి సంబంధించిన ఏ వీడియో లీక్ కాకూడదని రాజమౌళి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.

జనరల్ గా సినిమా వీడియోలు లీక్ అయ్యేది పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లోనే  అందుకే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరిగే చోటన్ సీసీ కెమెరాలతో కవర్ చేయిస్తున్నాడట రాజమౌళి. పోస్ట్ ప్రొడక్షన్ యూనిట్ లో ప్రతి టెక్నీషియన్‌ పై రాజమౌళి స్పై టీమ్ ఒక కన్నేసి ఉంచిందట. 

మొత్తానికి రాజమౌళి స్పై టీమ్ ‘బాహుబలి 2’ ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటు వస్తోంది అన్న వార్తలు హడావిడి చేస్తున్నాయి.  రాజమౌళి కట్టప్ప సీక్రెట్ ను చిత్రీకరించడంతో ఈ సీక్రెట్ ఈసినిమా విడుదల లోపు బయట పడుతుందా లేదా అన్నది చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: