మానవత్వానికి చలించే వ్యక్తులు రాజకీయాలకి పనికివస్తారా? అంటే దీనికి సమాధానం కాలమే చెప్పాలి. సమాజంలో నిత్యం ఎన్నో సమస్యలు ఉత్పన్నం అవుతాయి. వాటికి పరిష్కారాన్ని చూపగలితే వాడు లీడర్ అవుతాడు. సమస్య వచ్చిన ప్రతి సందర్భంలో వారిని ఆదుకునే వ్యక్తిని..మంచి మనిషి అంటూ గుర్తింపు వేస్తారు. ఇప్పుడు వీరిలో ఎవరు లీడర్? మంచి మనిషి లీడర్ గా మారగలడా? లీడర్ రాజకీయనాయుడిగా రాణించగలడా? ఇలాటి ప్రశ్నలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఉద్ధేశించి వినిపిస్తున్నవి.

పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని స్థాపించి అధికారాన్ని కైవసం చేసుకోవాల్సింది పోయి..చప్పుడు లేకుండా కూర్చోవటం ఎవ్వరికీ అర్ధం కావటం లేదు. సామాన్య ప్రజలు సైతం పవన్ కళ్యాణ్ ఆలోచనలో ట్రావెల్ చేయలేకోతున్నారు. దీంతో వీరిద్దరి మధ్య దూరం బాగా పెరుగుతుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ పలు సామాజిక సేవలు చేస్తున్నారు. సమస్యలతో బాధపుడతున్న వారి సమాచారం...తన వద్దకు వస్తే, ఆ రిపోర్ట్స్ ని పరిశీలించి భారీ ఎత్తున ఆర్ధిక సహాయం చేస్తున్నారు.

కనీసం లక్షకు మించిన చెక్కులను వెళ్లిన ప్రతి చోట ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఇప్పటి పవన్ కళ్యాణ్ చేసిన ఆర్ధిక సహాయ కనీస50 కోట్ల రూపాయల పైనే ఉంటుందనేది అంచనా. ఇది అతి కొద్ది మంది వ్యక్తలకే తెలిసిన సమాచారం. అయితే పవన్ కళ్యాణ్ లో ఇన్ని మంచి గుణాలు ఉన్నప్పటికీ…రాజకీయంగా పవన్ కళ్యాణ్ రాణించగలరా? అంటే…ఇక్కడ సమాధానం ఎవ్వరికీ కనిపించటం లేదు. రాజకీయాల్లో అణుచరులే అవినీతికి పాల్పడవచ్చు.

నిజానికి ప్రస్తుత సమాజంలో అవినీతి సహజంగా మారింది. ఇటువంటి సమమయంలో తను పవర్ లోకి వచ్చినప్పటికీ…ఇతరులు పవన్ కళ్యాణ్ కి ఏ విధంగా సపోర్ట్ చేస్తారు? అనేదే ఇక్కడ ప్రశ్న. సినిమాల పరంగా సంపాదించుకున్న సంపదని సేవ పేరుతో ఖర్చు చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. నేటి తరం ఇండస్ట్రీలో ఇలాంటి వారు కూడ చాలా అరుదు అని కూడ చెప్పవచ్చు. మొత్తంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న సహాయంపై ఇంకా తనకి అసంతృప్తే మిగిలి ఉందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: