స‌మాజంలో ఏదో అ సాద‌ర‌ణ ప్రతిభను క‌న‌బ‌రిచిన వ్య‌క్తి పై అభిమానం పెంచుకోవ‌డం మనిషి స‌హ‌జ ల‌క్ష‌ణం.  ఇలా అనేక రంగాల్లో సెలబ్రెటిల‌కు ఇప్ప‌టికి వ‌ల్ల‌మాలిన అభిమానులు ఉన్నారు. అభిమానుల ఉండ‌టం స‌హ‌జ‌మే కానీ, వారి అభిమానం కాస్తా ఉన్మాదంగా మార‌టాన్ని చూస్తేనే చాలా బాద ప‌డ‌క  త‌ప్ప‌దు. అభిమానానికి పోయి వారి జీవితాల‌కు పుల్ స్టాప్ పెట్టుకుంటున్నారు. తాజాగా తెలుగు సినీమా అగ్ర‌హీరో ప‌వర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అభిమానికి , మ‌రోస్టార్ హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ మొద‌లై మాట మాట పెరిగి... 'మా హీరో నే గొప్ప అంటే మా హీరో గొప్ప' అంటూ దాడులకు పాలు ప‌డ్డారు. ఈ దాడిలో ప‌వ‌న్ అభిమాని ప్రాణాలు కొల్పోవాల్సి వ‌చ్చింది. క‌ర్నాట‌కలో జ‌రిగిన  కార్య‌క్ర‌మంలో ఓ స్వ‌చ్చంధ సంస్థ అవ‌య‌వ‌దానం పై అవ‌గాహ‌న కోసం ఏర్పాటు చేసింది. 

ప‌వ‌న్ అభిమాని దారుణ హ‌త్య‌....


కార్య‌క్ర‌మం ముగిశాక వినోద్ తిరిగి వ‌స్తుండగా... అప్పటికే వినోద్ గొడ‌వ ప‌డ్డ మ‌రో హీరో అభిమానులు, అత‌న్ని దారుణంగా కొట్టారు. క‌త్తుల‌తో అత‌నిపై దాడి చేశారు. ఈ క్ర‌మంలోనే వినోద్  తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.  అ వ్య‌వ‌హారం కాస్త ఆల‌స్యంగా వెలుగు లోకి వ‌చ్చింది. అయితే ఈ దాడికి పాలు పడ్డ  అక్ష‌య్ కుమార్ అనే వ్య‌క్తిని ఇప్ప‌టికే క‌ర్నాట‌క పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ పాపం... ఏ పాపం తెలియ‌ని వినోద్ త‌ల్లితండ్రులు ఒంట‌రి వారయ్యారు. చేతికందొచ్చిన బిడ్డ ఇలా దూర‌మ‌వుతాడ‌ని  అనుకోలేద‌ని  క‌న్నీరు మున్నీరయ్యారు. అయితే ఈ వ్య‌వ‌హారం పై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ తిరుప‌తి లోని వినోద్ త‌ల్లిదండ్రుల‌ను ప‌రామ‌ర్శించారు.

హీరోలపై అభిమానం ఓ కుటుంబాన్ని వీధిన ప‌డేసింది...


అయితే ప‌రామ‌ర్శించాడే త‌ప్ప పోయిన కుమారుడి  స్థానాన్ని భ‌ర్తి చేయ‌లేడు క‌దా! అయితే ఇక్క‌డ అసలు విష‌య‌మేమిటంటే...సినీమా హీరోల‌పై  పెచ్చు మీరిన అభిమానం ఓ కుటుంబాన్ని వీధిన ప‌డేసింది. అభిమానం హ‌ద్దు మీరితే ప‌రిస్థితులు ఇలానే త‌గ‌ల‌డ‌తాయని మ‌రోసారి రుజువైంది. ఫ్యాన్స్ ల మ‌ధ్య ఇంత స్థాయిలో విభేధాలు ఉన్నా... హీరోల మ‌ధ్య ఎలాంటి విభేదాలూ ఉండవు. ఒక‌వేళ ఉన్నా స‌రే.... అంతా క‌లిసిమెలిసే ఉంటారు. మేమంతా ఒక్క‌టే అని చెబుతుంటారు. అభిమానుల‌కే అభిమానం హ‌ద్దులు దాటేసి , అది కాస్తా పిచ్చిగా మారిపోయి. ఆ పిచ్చి కూడా  పీక్స్  వెళ్ళి పోతుంది. అయితే ఈ తంతూ ఒక్క‌ప్పుడు ఉండేది కాదు... నాటి ఎన్టీఆర్, ఏఎన్నార్  నుంచి నేటి జూనియ‌ర్ ఎన్టీఆర్, నాగ చైతన్య వ‌రకు అభిమానులు ఉన్నారు. కానీ నాడు సందేశాత్మ‌కంగా ఉండే సినీమాలే తెర‌కెక్కించి... కుటుంబ స‌మేతంగా అభిమానించే లా ఉండేవి. ఇక అప్ప‌ట్లో అభిమానులు సైతం కేవ‌లం కొంత ప‌రిధికే ప‌రిమితం అయ్యేవారు. 
 
ఆడియో పంక్ష‌న్ లో ప్యాన్స్ నే టార్గెట్...

తెర పై త‌న అభిమాని క‌నిపించగానే కేరింత‌లు, చ‌ప్పుట్లు, విజిల్స్ ల‌తో ఆహ్వానించేవారు. కానీ తాజాగా హీరోల‌కు మాత్రం అభిమానం పెచ్చుమీరి పోతుంది. క‌ట్ ఔట్లకు గ‌జ‌మాల‌లు, హీరోల సినీమాల‌కు మేక ను బ‌లివ్వ‌డం. అడ్డొస్తే ఎవ‌నైనా కొట్టే స్థాయిలోకి వెళ్లారు. ఇక ఇప్పుడు వ‌స్తున్న సినీమాలు అభిమానుల‌ను రెచ్చ‌గొట్టే విధంగా ఉన్నాయి. ప్ర‌తి సారి సినీమా రిలీజ్ పంక్ష‌న్, ఆడియో పంక్ష‌న్, టైల‌ర్ రిలీజ్ వంటి కార్య‌క్ర‌మాల‌లో హీరోలు త‌మ అభిమానుల‌ను ద‌గ్గ‌ర అయ్యేందుకే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. తాజాగా ఓ పంక్ష‌న్ లో జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. " నా ఫోటో పై పాలు పోసి న‌న్ను దేవుడిని చేయ‌కండీ, ఆ పాలు నిరుపేద పిల్ల‌ల‌కు పంపిణి చేయండీ, నాకోసం మూగ జీవాల ప్రాణం తీయ‌కండీ, 10 మంది ఆక‌లిని తీర్చండి" అంటూ తెలిపారు. 

హీరో కు అభిమాని ముఖ్య‌మే...

అభిమానం ఉండాలే కానీ, అభిమానుల నుంచి అతిగా ఉహించుకోవ‌డం కూడా హీరోల త‌ప్పే అవుతుంది. మా అభిమాన హీరో పిలుపు నిచ్చాడ‌ని... ఇంట్లో నుంచి డ‌బ్బులు తీసుకెళ్లి త‌న అభిమానం చూపించుకునే వాళ్లు ఇప్ప‌టికీ ఉన్నారు. ఈ క్ర‌మంలో హీరోలు త‌మ అభిమానుల‌పై అతి పోక‌డ‌లు పోకుండా పరిస్థితులు త‌మ అదీనంలో ఉండేలా చూసుకోవాలి. వాస్త‌వానికి ఓ సినీమా హీరో కైనా అభిమాని చాలా ముఖ్య‌మే. సినీమా కొంత మార్కెట్ చేసేది ముమ్మాటికి అభిమానులే. తెలుగు సినీమాకే కాదు భార‌తదేశంలో సినీమాలు ఇంత‌గా హీట్ అవుతున్నాయంటే అభిమానులే కార‌ణం. అలాంటి అభిమానుల‌కు కాపాడుకోవాల్సిన బాద్య‌త కూడా హీరోల‌పై ఉంది. కేవ‌లం అభిమానుల‌తో క్యాష్  చేసుకోవాల‌నుకుంటే మాత్రం తీవ్ర న‌ష్టానికి గురికాక త‌ప్ప‌దు.

వినోద్ మ‌ర‌ణం ఓ గుణ‌పాఠం కావాలి...


ఇక, అభిమానులకు సైతం వినోద్ మ‌ర‌ణం ఓ గుణ పాఠం కావాలి. వినోద్ విష‌యంలో ప‌వ‌న్ ఎంత బాద్య‌త ఉందో... అంతే బాద్య‌త జూ ఎన్టీఆర్ పైన ఉంది. ఆయ‌న కూడా అభిమానిపై జాగ్ర‌త అవ‌స‌రం. ఏ  హీరో అభిమాని... అన్న‌దికాదిక్క‌డ విషయం. దాదాపు అంద‌రు హీరోల అభిమానుల్లోనూ అతిగాళ్ళు  ఉంటారు. ఆ అతిగాళ్ళ‌తోనే ఆయా హీరోల‌కూ ఇబ్బందుల వ‌చ్చిప‌డ్తున్నాయి. ఓ నిండు ప్రాణం.. ఇలా అభిమానం పేరుతో బ‌లైపోవ‌డం అత్యంత బాధాక‌ర‌మైన విష‌యం. అభిమానుల్ని ఉద్దేశించి ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొంత‌వ‌ర‌కు మెసేజ్ ఇచ్చారు. మరీ ఈ విష‌యంపై మ‌రో హీరో జూ ఎన్టీఆర్ స్పందించి ఇలాంటి ఘ‌ట‌న‌ల‌పై అప్ర‌మ‌త్తం చేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: