ఫిల్మ్ ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇస్తున్న హీరోలు ఎన్నో ఆశలలో వస్తారు. సాధారణ హీరో అయితే బడ్జెట్ కి అందుబాటులో ఉండే కాస్టింగ్ ని సెలక్ట్ చేసుకుంటారు. కానీ భారీ బ్యాక్ గ్రౌండ్ ని కలిగి ఉన్న డెబ్యూ హీరో అయితే...కాస్టింగ్ విషయంలో ఏ మాత్రం రాజీ ఉండదు. ప్రస్తుతం సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని ఓ డెబ్యూ హీరో ఎంట్రి ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. మాజీ ప్రధాని దేవేగౌడ మనువడు నిఖిల్ గౌడ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు.


తెలుగు, కన్నడ భాషల్లో ‘జాగ్వార్’ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ సుమారు 75 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. త్వరలోనే ఇది ఆడియో ఆవిష్కరణ వేడుకకు సిద్ధంగా ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ మూవీ ఆడియో ఫంక్షన్ కి వస్తుండటంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే నిఖిల్ గౌడ డెబ్యూహీరోగా వస్తున్న ఈ మూవీలో కాస్టింగ్ సైతం భారీగానే ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ సైతం భారీ స్టాండర్డ్ తో ఉన్నాయి.


నిర్మాణం విషయంలో నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు. ఇక డెబ్యూహీరో నిఖిల్ గౌడ కి స్టార్ హీరోయిన్ తమన్న అంటే చాలా ఇష్టం అని తెలుస్తుంది. తనతో డ్యాన్స్ చేయాలనేది తన కోరికని అంటున్నారు. అందులోని భాగంగానే జాగ్వార్ లో మూవీలో తమన్న చేత స్పెషల్ సాంగ్ కి నిఖిల్ గౌడ సిద్ధం అయ్యారు. చివరి నిముషంలో తమన్న ఈ ఆఫర్ ని వదులుకుంది. తనకు ఉన్న బిజి షెడ్యూల్స్ వల్ల ఇది కుదరలేదు. ఆ స్థానంలో ఇప్పుడు శ్రుతిహాసన్ చేస్తున్నారు.


డెబ్యూ హీరో సరసన స్టార్ హీరోయిన్స్ స్పెషల్ సాంగ్స్ అంటే రెమ్యునరేషన్ ని హీరోయిన్స్ కి భారీగా ఇచ్చుకోవల్సింది. ఇప్పుడు జాగ్వార్  మూవీలోనూ శ్రుతిహాసన్ చేస్తున్న స్పెషల్ సాంగ్ కోసం తను కోటి రూపాయలను తీసుకుంటుంది. నిజానికి ఈ ఆఫర్ ని తమన్న ఒప్పుకుంటే తనకి చెందాల్సిన రెమ్యునరేషన్ అని అంటున్నారు. ఇక జాగ్వార్ మూవీ మహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ మూవీ ఎటువంటి రిజల్ట్ ని ఇస్తుందో అనేది సౌత్ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: