ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో సినిమాలకంటే ముందు వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ అవుతున్నాయి..అంతేనా ఏకంగా స్టోరీ కూడా లీక్ అయ్యిందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ముందే లీక్ అయిన స్టోరీలు వాస్తవానికి దగ్గరగా ఉన్నా తీరా థియేటర్లో కి వెళ్లితే ఆ స్టోరీకి లీక్ అయిన స్టోరీకి అస్సలు పొంతన ఉండదు..కానీ ఒక్కో సమయంలో మాత్రం లీక్ అయిన స్టోరికి పూర్తిగా దగ్గర ఉన్నట్లు అనిపిస్తుంది. ఏది ఏమైనా స్టోరీ లికేజీ అనే విషయం పక్కన బెడితే సినిమా షూటింగ్ అయిన దగ్గర నుంచి కలెక్షన్లు వచ్చే వరకు పెద్ద సినిమాలు చేస్తున్న హంగామాలు అంతా ఇంతా కాదు. ఇక గత కొంత కాలంగా సినిమా స్టోరీ లీక్ అవుతున్న విషయాలు తెలిసిన విషయమే.
Image result for janatha garage
తాజాగా కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న ‘జనతా గ్యారేజ్ ’ సినిమా స్టోరీ లిక్ అయ్యిందంటూ సోషల్ నెట్ వర్క్ లో హల్ చల్ సృష్టిస్తుంది. స్టోరీ ప్రకారం చూస్తే.. ఎన్టీఆర్, సమంత,నిత్యా మీనన్ అందరూ ఫ్రెండ్స్..అయితే నిత్యామీనన్ అన్న ముంబై యూనివర్సిటీలో మాస్టర్స్ చదువుతాడు. వీరంతా ఒకరోజు కలిసి నేచర్ ట్రిప్ కి వెళ్తారు. అక్కడ అంతా బాగా ఎంజాయ్ చేస్తుంటారు..ఈ ట్రిప్ లో సమంతను ప్రేమిస్తాడు ఎన్టీఆర్.  మోహన్ లాల్ కూతురు నిత్యామీనన్ అయితే సడెన్ గా నిత్యామీనన్ అంటే మోహల్ లాల్ కొడుకుని ఎవరో చంపుతారు..మరోవైపు సమంత తన ప్రేమ విషయాన్ని తన పేరెంట్స్ కి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది.
Image result for janatha garage
అయితే మోహన్ లాల్ కొడుకుని చంపింది ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఎన్టీఆర్, మోహన్ లాల్ పరిచయం ఏర్పడుతుంది. మోహన్ లాల్ జనతా గ్యారేజ్ నడుపుతుంటాడు..తన కొడుకు చనిపోయిన తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన మోహన్ లాల్ కి ఎన్టీఆర్ ఎలా పరిచయం అవుతాడు..ఎన్టీఆర్, మోహన్ లాల్ మద్య జరిగే సంభాషనలు సెంటిమెంట్ సీన్లు, ఎమోషనల్ సీన్లు, నేచర్ ని కాపాడే సంఘటనలు కోరటాల శివ చాలా అద్భుతంగా మలిచినట్లు తెలుస్తుంది.  ఏది ఏమైనా ఈ స్టోరీ ఎంతవరకు నిజమో కాదో కానీ సినిమా ట్రైలర్ చూస్తుంటే మాత్రం మరో శ్రీమంతుడు చిత్రం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: