మెగాస్టార్ చిరంజీవి 8 ఏళ్ల తర్వాత నటిస్తున్న ఖైది నెంబర్ 150 సినిమా రాం చరణ్ నిర్మించడం జరుగుతుంది. కత్తి రీమేక్ గా వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ మెగా అభిమానులను ఎంతగానే ఆకట్టుకున్నాయి. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తో సూపర్ స్టార్ మహేష్ అదిరిందని రెస్పాన్స్ ఇచ్చాడంటే అర్ధం చేసుకోవచ్చు. అయితే ఇప్పటికే సగం పూర్తయిన ఈ సినిమాను త్వరగా ఫినిష్ చేసి సంక్రాంతి రేసులో దించాలనే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమా కంప్లీట్ అవ్వక ముందే ఇక తాను చేయబోయే తర్వాత సినిమా గురించి ఇప్పటి నుండే ప్లాన్ చేస్తున్నాడట మెగాస్టార్.


అసలైతే చిరు 150 సినిమానే అల్లు అరవింద్ నిర్మించాల్సి ఉంది కాని తల్లి కోరిక తీర్చాలనే తపనతో రాం చరణ్ నిర్మాణ బాధ్యతలను చేపట్టాడు. ఇక 151వ సినిమా కచ్చితంగా గీతా ఆర్ట్స్ లోనే ఉంటుందని టాక్. అయితే చిరుతో సినిమా కోసం మిగతా ప్రొడక్షన్ కంపెనీలు ట్రై చేస్తున్నా తన ఓటు మాత్రం అల్లు అరవింద్ కే అంటున్నాడట చిరంజీవి. ఇక ఇచ్చినన్నాళ్లు గ్యాప్ ఇచ్చినా ట్రాక్లో పడ్డాక ఇక వరుసెంట సినిమాలు చేయాలని డిసైడ్ అయ్యారు అందుకే సినిమా పూర్తవ్వక ముందే మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు.


ఇక చిరు 151వ సినిమాకు దర్శకుడిగా బోయపాటి శ్రీను పేరు వినపడుతుంది. రీసెంట్ గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సరైనోడు అంటూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బోయపాటి చిరు కోసం ఇప్పటికే ఓ కథను సిద్ధం చేశాడట. అల్లు అరవింద్ సమక్షంలోనే చిరుకి కథ వినిపించడం చిరు కొన్ని చేంజెస్ చెప్పడం జరిగిందట. సో చిరు 151 సినిమా బోయపాటి డైరక్షన్లోనే అని ఫిక్స్ అవ్వొచ్చు. ప్రస్తుతం బోయపాటి శ్రీను బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా చేస్తున్న సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.


హీరోని బట్టి తన కమర్షియల్ యాంగిల్ ను చూపించే బోయపాటి చిరుతో సినిమా తీస్తే ఎలా ఉంటుందో అని ఇప్పటినుండే ఫ్యాన్స్ మంచి అంచనాలతో ఉన్నారు. మరి అందరి అంచనాలను అందుకునేలా సినిమా ఉంటుందేమో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: