స్టార్ క్రేజ్ ఉన్న హీరోయిన్స్ అయినా సరే అవకాశం వస్తే ఐటం సాంగ్ అయినా నో చెప్పక చేసే రోజులివి ఇక కాస్త ఫేడవుట్ అవుతున్న భామలైతే ఐటం సాంగ్స్ మేము కూడా రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్స్ ఇచ్చేస్తుంటారు. ఇన్నాళ్లు కెరియర్ లో స్టార్ హీరోయిన్ గా సౌత్ సిని ప్రేక్షక హృదయాల్లో నిలిచిన కాజల్ కెరియర్ లో మొదటి సారి ఐటం సాంగ్ కు రెడీ అయ్యింది.


కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కాంబినేషన్లో రాబోతున్న జనతా గ్యారేజ్ సినిమాలో ఐటం సాంగ్ పక్కా లోక అంటూ కాజల్ తారక్ తో ఆడి పాడనుంది. ఇక ఈ సాంగ్ లో కాజల్ ఎలా ఉండబోతుంది అన్న ఎక్సైట్మెంట్ ఫ్యాన్స్ లో ఉంది. అందుకే వారి కోసం తన పక్కా లోకల్ పాప ఓ పిక్ రివీల్ చేసింది. అది ఐటం సాంగ్ లో కాజల్ లుక్.


చూస్తుంటే లోకల్ పిల్ల అరుపులు పెట్టించేయడం ఖాయమనిపిస్తుంది. ఇంత కాలం హీరోయిన్ గానే అలరించిన కాజల్ ఇప్పుడు ఐటం గా టర్న్ అవ్వడం కెరియర్లో మంచి బూస్టప్ అందినట్టే. ఇక ఎన్.టి.ఆర్ మాస్ స్టెప్పులకు కాజల్ నాటు అందాలు ఆడియెన్స్ కు మంచి ఫీస్ట్ అందిస్తాయనడంలో సందేహం లేదు.


ఇక సినిమా విషయానికొస్తే నేచర్ లవర్ గా హీరో క్యారక్టరైజేషన్ కొత్తగా ప్రయత్నించి తారక్ ను డిఫరెంట్ స్టైల్ తో చూపించబోతున్న దర్శకుడు కొరటాల శివ ముందు రెండు సినిమా సూపర్ హిట్ ఫలితాన్నే ఈ జనతా గ్యారేజ్ తో కూడా అందుకుంటాడని తెలుస్తుంది. సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో చూడాలి.


సమంత, నిత్యా మీనన్ హీరోయిన్స్ గా నటిస్తున్నా సినిమాకు అదనపు స్పెషల్ ఎట్రాక్షన్ కోసం కొరటాల శివ కాజల్ తో కేక పెట్టించే ఐటం సాంగ్ సిద్ధం చేశాడు. మరి జూనియర్ తో కాజల్ వేసే పక్కా లోక పనులేంటో చూడాలంటే మరో వారం రోజులు ఆగితే సరిపోతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: