ఇండస్ట్రీలో ఓ హిట్ పడితే ఓవర్ నైట్ స్టార్ అయినట్టే ఎలాంటి అంచనాలు లేకుండా ఈ మధ్య ఓ చిన్న సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కుర్ర హీరో ఇప్పుడు దర్శక నిర్మాతలకు బెస్ట్ ఆప్షన్ అయ్యాడు. అంతేకాదు రీసెంట్ హిట్ ను క్యాష్ చేసుకునే ఉద్దేశంతో తన సినిమాలను వరుసగా వదులుతూ మిగతా కుర్ర హీరోలకు షివరింగ్ తెప్పిస్తున్నాడు.


ఎవడే సుబ్రమణ్యంతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ ఆ సినిమాతో పర్వాలేదనిపించుకున్నా పెళ్లిచూపులు సినిమాతో ఈ సంవత్సరం బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా చేరేలా తన ఖాతాలో సూపర్ హిట్ అందుకున్నాడు. హీరోగా చేసిన తొలి సోలో సినిమా హిట్ అవడంతో ఇక విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇన్నాళ్లు తను తీస్తున్న సినిమాల ఊసే ఎత్తని వారు కూడా విజయ్ తర్వాత చేస్తున్న సినిమాల మీద ఫోకస్ పెట్టారు. 


ప్రస్తుతం విజయ్ అర్జున్ రెడ్డి, ద్వారకా సినిమాలు చేస్తున్నాడు. ద్వారాక సినిమా టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. కృష్ణుడి పాటతో వచ్చిన ఈ సాంగ్ ఆడియెన్స్ కు కనెక్ట్ అవ్వడమే కాదు మరో హిట్ కొట్టేందుకు రెడీ అన్నట్టు ఉంది. విజయ్ లుక్ కూడా డిఫరెంట్ గా ఉండటంతో ద్వారకా సినిమా కోసం ఫ్యాన్సీ ఆఫర్లు వస్తున్నాయట.


ఇన్నాళ్లు ఆ సినిమా ఒకటి ఉంది అన్న ఆలోచనే లేని దర్శక నిర్మాతలు ఇప్పటికిప్పుడు వచ్చేసి ఆ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసేందుకు మంచి ప్రైజ్ ఆఫర్ చేస్తున్నారట. ఇక పెళ్లిచూపులుతో ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పరచుకున్న విజయ్ తన సినిమాలకు అక్కడ మార్కెట్ సిద్ధం చేసుకున్నాడు.


ద్వారక సినిమా టీజర్ సాంగ్ అయితే బాగుంది. మరి పెళ్లిచూపులు హిట్ తో తన మీద అంచనాలు పెరిగేలా చేసుకున్న విజయ్ హిట్ కొట్టి క్రేజ్ సంపాదిస్తాడా లేదా అన్నది ఇప్పుడు అందరు ఎదురుచూస్తున్నారు. ఓ పక్క విజయ్ సినిమాతో కుర్ర హీరోలకు అప్పుడే తలనొప్పిగా మారుతున్నాడు. మరి ఈ పోటీలో విజయ్ ఎలా విజయాలతో ముందుకెళ్తాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: