అసలు టాలీవుడ్ లో ఎలాంటి ప్రోగ్రాం జరిగినా యాంకరింగ్ కి సుమ లేనిదే ఆ ప్రోగ్రాం పండదు. సుమ స్టేజీ ఎక్కాలి , మైకు అందుకోవాలి తనదైన బాణీ లో స్టైల్ గా కథ మొదలెట్టాలి అప్పుడే కిక్కు. సాక్షాత్తు బాహుబలి లాంటి ఖళాఖండం తీసిన రాజమౌళి కే సుమ అవసరం అయ్యింది. అప్పట్లో తిరుపతి లో ఆడియో ఫంక్షన్ పెట్టుకుని సుమ రావడం ఆలస్యం అయ్యింది అని వాళ్ళతో వీళ్ళతో ప్రోగ్రాం నడిపిస్తూ ఉంటే జనాలకి బోర్ కొట్టేసింది. దాంతో సుమని ప్రత్యేక విమానం లో రప్పించి, ఎయిర్పోర్ట్ నుంచి ప్రోగ్రాం జరిగిన ప్రాంతానికి హడావిడి హడావిడిగా రప్పించాల్సి ఒచ్చింది.                                                                 

ఈ హడావిడి మొత్తం చూస్తే చెప్పచ్చు సుమ రేంజ్ ఏంటి. ఆ రోజు ఆమె స్టేజీ ఎక్కి అందరికీ గట్టిగా హాయ్ అని చెప్పిందో లేదో దెబ్బకి తిరుపతి మొత్తం హోరెత్తే విధంగా అరిచి గోల చేసారు జనాలు.హీరో ప్రభాస్ కి కూడా ఆ ఆడియో లాంచ్ లో అంత రెస్పాన్స్ రాలేదు అంటే నమ్మండి. ఆమె లెక్క అలా ఉంటుంది అన్నమాట. అందుకే ఆమె ప్రతీ ప్రోగ్రాం కీ లక్షలకి లక్షలు అడిగినా ససేమిరా అనకుండా ఇచ్చేస్తూ ఉంటారు ప్రొడ్యూసర్ లు. మెగా హీరోల - మెగా ఈవెంట్ లు అంటే సుమ ప్రత్యక్షం అయ్యి తీరుతుంది. అక్కడ యాంకరింగ్ అంతా కూడా ఆమె మోనోపోలీ లో నడుస్తుంది. అంతే కాకుండా సుమ ప్రొడ్యూస్ చేస్తూ , యాంకరింగ్ చేస్తున్న ప్రోగ్రాం లలో కూడా మెగా హీరోలు ఎక్కువగానే పాల్గొంటారు. సుమకి మాత్రమే ఎప్పుడూ ఇంటర్వ్యూ లు ఇవ్వని పవన్ కళ్యణ్ అప్పట్లో తన మొదటి ఇంటర్వ్యూ ఇచ్చాడు అంటే మెగా హీరోలలో ఆమెకి ఉన్న సపోర్ట్ అర్ధం చేసుకోవచ్చు.

                                                                     

అలాంటి సుమ మొన్న చిరంజీవి 61 వ పుట్టిన రోజు సెలెబ్రేషన్ రోజున శిల్పకళా వేదిక లో ఎక్కడా కనపడలేదు. యాంకరింగ్ కి రాలేదు సరికదా ప్రోగ్రాం లో కూడా రాలేదు. ఆ ప్రోగ్రాం కి సుమని కావాలనే పక్కన పెట్టారట.ఎందుకంటే అది ఫాన్స్ అందరూ ప్రత్యేకంగా చిరంజీవి కోసం చేస్తున్న పుట్టినరోజు వేడుక. జరిగేది ఫాన్స్ పేరు మీదనే అయినా మెగా హీరోలు అందరూ అక్కడే దర్సనం ఇస్తారు. ఈ మాత్రానికి ఖరీదైన యాంకర్ సుమని పిలవడం వలన ఉపయోగం ఉండదు. పైగా ప్రోగ్రాం ఎక్కువసేపు జరిగే ఆలోచన కూడా చరణ్ కి లేదు, అవతల పార్క్ హయాత్ లో మెగా ఫామిలీ పర్సనల్ గా చేసుకునే భారీ పార్టీ ఉండగా ఇది త్వరగా కానిచ్చేయ్యాలి అని చరణ్ అనుకున్నాడు.

మరొక పక్క చిరంజీవి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ మాత్రానికి సుమ కోసం లక్షల్లో ఖర్చు పెట్టడం ఎందుకు అనేది చరణ్ ఆలోచన. అందుకే సింపుల్ గా శ్యామల ని పెట్టి లాగించేసారు. కేవలం యాంకర్ విషయం లో ఇంత హడావిడా? అనుకోవడానికి కూడా లేదు ఎందుకంటే సుమ క్రేజ్ అలా నడుస్తోంది మరి. చిన్న సినిమా , పెద్ద సినిమా అనే తేడా లేకుండా సుమ మామూలు హడావిడి చెయ్యట్లేదు. టీవీ ప్రోగ్రాం లూ , గేమ్ షో లూ .. సినిమాల్లో వేషాలకి అవకాశాలు దక్కినా వాటిని చెయ్యడానికి సమయం కూడా ఖాళీ లేనంతగా సుమ బిజీ అయిపొయింది అంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: