మెగా హీరోయిన్ రెజీనా వచ్చే నల 9న విడుదల కాబోతున్న ‘జ్యో అచ్యుతానంద’ సినిమాను ప్రమోట్ చేస్తూ నిన్న జరిగిన మీడియా మీట్ లో టాప్ హీరోల బిరుదుల పై హాట్ హాట్ సెటైర్లు వేసింది.  ఈ సందర్భంలో  ఆమెను ఇరుకున పెట్టడానికి ఒక మీడియా ప్రతినిధి హీరోలకు స్టార్ బిరుదులు ఉన్నాయి.  మరి హీరోయిన్స్ కు అటువంటి స్టార్ బిరుదులు ఇవ్వవలసి వస్తే ప్రస్తుతతరం టాప్ హీరోయిన్స్ లో ఎవరికీ ఏ స్టార్ బిరుదులు ఇస్తారు అని కార్నర్ చేసినప్పుడు రెజీనా ఆ సక్తికరమైన కామెంట్స్ చేసింది.

తాను హీరోయిన్స్ కు బిరుదులు ఇవ్వవలసి వస్తే సమంతకు సూపర్ స్టార్ – అనుష్కకు తలైవా – రకుల్ కు జిమ్ స్టార్ – రాశి ఖన్నాకు క్యూట్ స్టార్ – నిత్యామీనన్ నేషనల్ స్టార్ ఇస్తానని టాప్ హీరోల బిరుదులు అన్నీ హీరోయిన్స్ కు అంటగట్టింది రేజీన.  అంతేకాదు తనను తాను ఫన్ స్టార్ గా అభివర్ణించు కుంటూ తాను కూడ ఏమి తక్కువ కాదు అన్న సంకేతాలను ఇచ్చింది రెజీనా.

ఇదే సందర్భంలో మరో మీడియా ప్రతినిధి సాయి ధరమ్ తేజ్ తో బ్రేకప్ అయ్యారా ? అని ప్రశ్నించినప్పుడు రెజీనా షాక్ అయి   ‘అబ్బే అలాంటిదేమీ లేదు. మేమిద్దరం కలిసి సినిమాలు చేసేటప్పుడు మా మధ్య ఏదో ఉందని అంటూ  వార్తలు వ్రాసారు. ఇప్పుడు మేము కలిసి సినిమాలు చేయకపోవడంతో మేమిద్దరం బ్రేకప్ అయ్యామని వార్తలు వ్రాస్తున్నారు. ఇది అంతా మీ ఊహే’ అంటూ మీడియా పై రివర్స్ సెటైర్ వేసింది రెజీనా.

ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ తనకు 90 సంవత్సరాలు వచ్చిన తరువాత తన మనవళ్ళతో కూడ కలిసి హాయిగా ‘జ్యో అచ్యుతానంద’ సినిమాను చూస్తాను అంటూ ఈ సినిమా పై అంచనాలు పెంచేస్తోంది రెజీనా.  ఈమెకు ఇంత భారీ అంచనాలు ఉన్నాయి కాబట్టే కాబోలు ఈ సినిమా నిర్మాతలు ‘జనతా గ్యారేజ్’ సునామీని లెక్క చేయకుండా కేవలం వారం రోజుల గ్యాప్ తో ‘జ్యో అచ్యుతానంద’ ను విడుదల చేస్తున్నారు అనుకోవాలి.

ఈ మీడియా సమావేశంలో తన బాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ తాను నటిస్తున్న ‘ఆంఖే-2’ విషయాలను షేర్ చేసుకుంటూ ఈమధ్యనే తనకు అమితాబ్ అనీల్ కపూర్ లకు మధ్య తీసిన ఫోటో షూట్ ఎప్పుడు విడుదల అవుతుందా  అని ఎదురు చూస్తున్నానని కామెంట్ చేసింది రెజీనా. 

తాను తమిళంలో మరో రెండు సినిమాలు చేస్తున్న విషయాన్ని వివరిస్తూ తనకు అన్ని భాషల సినిమాల నుంచి ఆఫర్లు వస్తున్న విషయాన్ని బయట పెట్టింది.  దీనితో రెజీనా తన పై ఇప్పటి వరకు పడ్డ  మెగా హీరోయిన్ ముద్రను చెరిపి వేసుకుని తాను కూడ టాప్ హీరొయిన్ గా మారాలని కోరుకోవడం సహజం అనుకోవాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: