మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఒక చరిత్ర. ఎన్నో సక్సెస్ చిత్రాల వెనుక తను పడ్డ కష్టం చెప్పలేనిది. తన సక్సెస్ వెంటే అభిమానులు కూడ నడిచారు. ఆ తరువాత చిరంజీవి ని ఓ కీలక రాజకీయనాయకుడిగా మార్చిన దాంట్లోనే అభిమానులదే కీలక పాత్ర. చిరంజీవి సినీరాజకీయ ప్రస్థానంలో అభిమానుల ప్రస్థానం లేకుండా ముందుగా సాగలేం. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ ‘ఖైదీ నెం. 150’ తో జోరు మీద ఉన్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.


వీవీ వినాయక్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. దాదాపు 9 సంవత్సరాల తరువాత వస్తున్న చిరంజీవి సినిమా బాక్సాపీస్ ని ఏ విధంగా షేక్ చేయనుందనేది ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి కాంగ్రేస్ పార్టీ రాజకీయాల్లో కీలకంగా ఉన్నారు. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు స్థాపించిన జనసేన పార్టీలో ముఖ్యంత్రి అభ్యర్ధిగా నిలబడనున్నారనేది కీలక సమాచారం.


దీనికి సంబంధించిన సమాచారం ఇప్పటికే మెగా అభిమాన సంఘాలకు చేరాయని అంటున్నారు. ఇందుకు అభిమాన సంఘాలు నుండి సైతం మద్ధతు లభించింది. ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకి అంటీఅంటనట్టుగా ఉండాలని నిర్ణయించుకున్నారంట. అందులో భాగంగానే వరుస చిత్రాలను ఒప్పుకుంటున్నారు. 150వ చిత్రంతో తన కోరికను తీర్చుకోవాలనుకున్న చిరంజీవి, ఆ తరువాత కూడ వరుస చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ వస్తున్నారు.


ఇప్పటకే 151, 152 చిత్రాలకి సంబంధించిన వాటిపై చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. చిరంజీవి ఇక రాజకీయాలకు దూరంగా ఉండటం అనేది మెగాఅభిమానులకి ఇది షాకింగ్ లా మారిందని అంటున్నారు. ప్రస్తుతం తను నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ మాత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: