రామ్ చరణ్ సెంటిమెంట్ కు ఎదురు ఈదుతూ తనకు ఇప్పటివరకు కలిసి రాని దసరాను  టార్గెట్ చేస్తూ అక్టోబర్ 7న విడుదల కాబోతున్న రామ్ చరణ్  ‘ధృవ’ సినిమా పై ఆ సినిమా యూనిట్ చేస్తున్న కొన్ని పొరపాట్లు రామ్ చరణ్ కు శాపంగా మార బోతున్నయా అంటూ కొన్ని కామెంట్స్ ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి. ఫిలింనగర్ లోని కొన్ని వర్గాలు వ్యక్త పరుస్తున్న అభిప్రాయాల ప్రకారం  ఒక సినిమా దర్శక నిర్మాతలు ఏదైనా ఇతర భాషలో హిట్ అయిన  సినిమాను వారి భాషలో రీమేక్ చేస్తున్నప్పుడు ఆ సినిమాకు సంబంధించిన హక్కులను కొనుక్కోవడం సర్వ సాధారణ విషయం.

అదేవిధంగా ఆ ఒరిజినల్ మూవీని రీమేక్ చేయబోతున్న ఆభాష ఆడియన్స్ కు అందకుండా చూసుకుంటూ ఉంటారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అయితే రామ్ చరణ్ రీమేక్ సినిమా ‘ధృవ’  విషయంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్ల ఆ సినిమాకు భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది అని కొందరి  విశ్లేషకుల భావన.

తమిళ సినిమా ‘తనీ ఒరువన్’ కు రీమేక్ గా ‘ధృవ’  తయారువుతున్న నేపధ్యంలో  అసలు తమిళ వెర్షన్ ఎలా ఉందో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగి ఈ మధ్య యూట్యూబ్ లోఈసినిమా చూస్తున్న వారి సంఖ్య బాగా  పెరుగుతున్న నేపధ్యంలో ఈ సినిమా రీమేక్ రైట్స్ ను కొన్న ఈ సినిమా నిర్మాత్తలు   ఈ  సినిమా ప్రింట్ అఫిషియల్ గా ఇంటర్నెట్ లో లేకుండా చూసుకునే విషయంలో అశ్రద్ధ  చేస్తున్నారు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

ఈ నేపధ్యంలో ఈ సినిమా తమిళ వెర్షన్  యూట్యూబ్ లో అధికారికంగానే అందుబాటులోఉండటంతో చాల మంది చూసి ‘ధృవ’ విడుదల అయిన తరువాత ఆ సినిమాకు ‘తని ఒరువన్’ కు పోలుస్తూ కామెంట్స్ చేయడమే కాకుండా ఈ రెండు సినిమాలలో ఏది బెటర్ అనే చర్చలు చేపెట్టే అవకాశంతో కూడిన ప్రమాదం ‘ధ్రువ’ కు పొంచి ఉంది అని విశ్లేషకుల వాదన.

ఈ విషయాలు తెలిసి ఉండి కుడా ‘ధృవ’ ను నిర్మిస్తున్న నిర్మాతలు పట్టించు కోకపోవడం వారి మితిమీరిన ఆత్మస్థైరైయాన్ని సూచిస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. అంతే కాదు భారీ పెట్టుబడితోతీస్తున్న ఈ తమిళ వెర్షన్ ను అధికారికంగా ఇంటర్నెట్ లో లేకుండా చూసుకుని ఉంటే అది ‘ధ్రువ’ నిర్మాతలకు మంచిది అన్న విష్యం ఎలా మరిచి పోయారు అన్న సెటైర్లు పడుతున్నాయి.  

ఈ మధ్య కాలంలో ఒక పర భాష సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నారు అని తెలియగానే ఆ సినిమా ఒరిజనల్ వెర్షన్ ను యూట్యూబ్ లో చూడటం ఒక ఫ్యాషన్ గా మారిపోయిన విషయం  ఈ సినిమాలో నటిస్తున్న రామ్ చరణ్ కు తెలియదా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఒక సీరియస్ మూవీగా పేరుతెచ్చుకున్న ‘తని ఒరువన్’ కు  రీమేక్ గా వస్తున్న ‘ధృవ’ విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తతో ఉన్నా అసలుకే మోసం వచ్చి అది చరణ్ కు మరో సెంటి మెంట్ షాక్ గా మారే అవకాశం ఉంది అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: