తాజాగా ఫ్యాన్స్ మధ్య జరిగిన గొడవలో గాయపడి చనిపోయిన పవన్ అభిమాని వినోద్ రాయల్ సంఘటన, ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీనికి సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కనుక్కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదిలా ఉంటే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వినోద్ రాయల్ కుటుంబాన్ని పరామర్శించి, తన కుటుంబానికి అండగా ఉంటానని హావీ ఇచ్చారు.


పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ కార్యక్రమాల్లో వినోద్ రాయల్ చురుగ్గా పాల్గొనేవాడు. అయితే హీరోల మధ్య వచ్చిన డిస్కషన్స్ లో క్షణికావేశానికి లోనైనా ఆ ఫ్యాన్స్ గొడవ పడ్డారు. అందులో భాగంగానే వినోద్ ని..ఎదుటివారు కత్తులతో దాడి చేశారు. అయితే జరిగిన గొడవ నిజంగా అభిమానుల మధ్య వచ్చిన గొడవేనా...లేక ఇతరుల భాగస్వామ్యం ఏమైనా ఉందా?అనే కోణంలో ప్రస్తుతం విచారణకి ఫ్యాన్స్ ఇచ్చిన సమాచారం ఎంతగానో ఉపయోగపడిందని అంటున్నారు.


ఇదిలా ఉంటే వినోద్ రాయల్ కి సంబంధించిన స్నేహితులు...అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దీనిపై పూర్తి సమాచార సేకరణని చేపట్టారని తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అభిమాన సంఘాల వద్ద దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఉందని అంటున్నారు. అలాగే పవన్ కళ్యాన్ సైతం వీరి వద్ద ఉన్న సమాచారాన్ని పూర్తిగా తెలుసుకున్నట్టుగా తెలుస్తుంది.


ఇక పవన్ కళ్యాణ్ దీనిపై స్పంధించిన తీరు ఇతర అభిమానుల సంఘాల ప్రవర్తనని మార్చే ప్రయత్నంగా ఉందని అంటున్నారు. “హీరోలందరూ సమానమే. మేమందరం బాగానే కలిసి ఉన్నాం. మా హీరో గొప్ప అంటూ గొడవపడడం అభిమానులకు మంచిది కాదు. అభిమానాన్ని మితిమీరిన స్థాయికి తీసుకెళ్ళి హింసకు దారితీసేలా చేయొద్దని కోరుకుంటున్నా” అని సందేశమిచ్చిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: