ఫిల్మ్ ఇండస్ట్రీలోకి డెబ్యూ ఇస్తున్న ఆర్టిస్ట్ లు ఏ విధంగా ఫిల్మ్ కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలి అన్న దానిపై ఓ ప్రత్యేకమైన గైడన్స్ ఉంటుంది. ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు, సీనియర్స్ ఈ గైడెన్స్ ని ఇస్తుంటారు. కొంతమందికి ఇండస్ట్రీకి వచ్చిన వెంటనే సక్సెస్ వస్తుంది..ఆ వెంటనే కెరీర్ గ్రాఫ్ పడిపోతుంది. మరికొందరికి సక్సెస్ అనేది స్లోగా వస్తుంది..చిరకాలంగా ఉంటుంది.

ఇక సక్సెస్ ని తక్కువ సమయంలో చూసిన వారికి ఎక్కువ శాతం ప్లాప్ లను వరిస్తాయనేది ఇండస్ట్రీలో అనుభవం ఉన్న వారు చెబుతుంటారు. ఎందుకంటే వారికి సరైన గైడెన్స్ ఉండదు. మొదటి మూవీకే సూపర్ స్టార్ సరసన ఆఫర్ వస్తే...తరువాతి ఆఫర్స్ సైతం సూపర్స్ స్టార్స్ తోనే ఉంటుందని అనుకుంటారు. ఇప్పుడు ఈ విధంగా ఆలోచించిన ఓ స్టార్ హీరోయిన్ అడ్డంగా బుక్కయింది. ఒక లైలా కోసం.. ముకుంద వంటి సినిమాలతో టాలీవుడ్లో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ పూజా హెగ్డే.

ఈ బ్యూటీకి సౌత్ మార్కెట్ లో మంచి పేరు ఉన్నప్పటికీ వాటిని కాదనుకొని బాలీవుడ్ ఫిల్మ్ ‘మొహెంజదారో’ కోసం దాదాపు 2 సంవత్సరాలు కేటాయించింది. ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ని సాధించలేకపోవడంతో పూజా హెగ్డే కి అటు బాలీవుడ్ లోనూ, ఇటు సౌత్ మార్కెట్ లో డిమాండ్ తగ్గిపోయింది. అలాగే 4 ప్రముఖ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం ఆ కంపినీలు ఝలక్ ఇచ్చాయి.  ‘మొహెంజదారో’ ప్లాప్ కారణంగా పూజా హెగ్డే నుండి అన్నీ బ్రాండ్స్ చేజారిపోయాయి.

ఒక్క సినిమా దెబ్బకి పూజా హెగ్డే పరిస్థితి ఘోరంగా ఉంది. చేతిలో కొత్త సినిమాలు లేక...ఉన్న బ్రాండ్స్ అన్నీ చేజారిపోయి పూజా హెగ్డే డైలమాలో ఉందని అంటున్నారు. దాదాపు రెండు సంవత్సరాల సమయాన్ని బాలీవుడ్ మూవీకి ఇవ్వటంతో వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవటం అనేది సంవత్సరం పైనే పడుతుందని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: