బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్స్ మధ్య ప్రమాయాణం చాలా కామన్. అయితే అది పెళ్ళి వరకూ వెళుతుందా?లేదా? అనేదే తెలియాల్సింది. ఆ విధంగా ఓ జంట దాదాపు సంవత్సరాల తరబడి ప్రేమించుకుంటూనే ఉన్నారు. చివరకు పెళ్లి జరుగుతుందని ఇండస్ట్రీ అంతా భావించినప్పటికీ...చివరి నిముషంలో అది కాస్త బ్రేక్ అప్ గా మారిపోయింది.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లవర్స్ గా పేరు తెచ్చుకున్న కాంబినేషన్ లో రణ్ భీర్ కపూర్, కత్రినాకైఫ్ ఒకరు. రణ్ భీర్ కపూర్ తో కత్రినాకైఫ్ ప్రేమాయణం ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరికి తెలుసు. అందరూ వీరిద్దరూ కచ్ఛితంగా పెళ్లి చేసుకుంటారు అని అనుకున్నారు. ఇద్దరి ఇంట్లోనూ పెళ్ళికి సంబంధించిన వ్యవహారంపై చర్ఛలు జరిగాయి. అయితే రణ్ భీర్ కపూర్ ఇంట్లో కత్రినాకైఫ్ పై కొంత అభ్యంతరాలు తెలపటంతో...వీరిద్దరి పెళ్ళికి అక్కడ బ్రేక్ పడింది. అయినప్పటికీ...వీరిద్దరూ చాలా కాలం ప్రేమని కొనసాగించారు.


ప్రత్యేక ప్రదేశాలకి ఏకాంతంగా వెళ్లి సంతోషాన్ని పంచుకున్న సందార్భాలు అనేకం. అయితే వీరు ఎక్కడికి వెళ్లినా...కొన్ని ఫోటోలు ఇంటర్నెట్ లో లీక్ కావటం ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా మారాయి. ముఖ్యంగా వీరు బీచ్ లో ఎంజాయ్ చేసిన ఫోటోలు బయటకు వచ్చేవి. అయితే ప్రస్తుతం ఆ బీచ్ లో ప్రియురాలు కత్రినాకైఫ్ తో రణ్ భీర్ కపూర్ చేసిన రొమాన్స్ వీడియోలు బయటకు వచ్చాయి. ఇది ఇండస్ట్రీకి మరింత హాట్ టాపిక్ గా మారింది.


ప్రముఖ సోషియల్ వెబ్ సైట్స్ దగ్గర రణ్ భీర్ కపూర్, కత్రినాకైఫ్ లకి సంబంధించి బీచ్ రొమాన్స్ వీడియోలు ఉన్నట్టుగా ఇండస్ట్రీలో అందుతున్న సమాచారం. దీనిపై కత్రినాకైఫ్ సీరియస్ గా ఉంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం రణ్ భీర్ కపూర్, కత్రినాకైఫ్ ఎవరికివారు బ్రేక్ అప్ చెప్పుకొని సినిమాల్లో బిజిగా ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో వీరు ఎంజాయ్ చేసిన వీడియోలు బయటకు రావటంపై కత్రినాకైఫ్, బాయ్ ప్రెండ్ రణ్ భీర్ కపూర్ పై వెరీ సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: