టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న హీరోయిన్ అనుష్క. ప్రస్తుతం అనుష్క సౌత్ ఇండస్ట్రీ ప్రెస్టేజియస్ ఫిల్మ్ బాహుబలిలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా ముందుకు వెళుతుంది. ఇదిలా ఉంటే తాజాగా అనుష్క ఓ గ్రేట్ ఆఫర్ ని అందుకుందని కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం.


దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, ప్రస్తుతం అనుష్క పలు చిత్రాలతో బిజిగా ఉంది. తమిళ్ లో ఒక చిత్రం, తెలుగులో మూడు చిత్రాలతో తీరికలేని సమయాన్ని గడుపుతుంది. అయితే ఈ మధ్య కాలంలో కొంత మంది బాలీవుడ్ హీరోయిన్స్, సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ ని చేజిక్కించుకోవాలని చూస్తున్నారు. అటువంటి వారిలో సోనాక్షి సిన్హా ఒకరు. ఈ బ్యూటీ సౌత్ లో హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలో నటించేందుకు రంగం సిద్ధం చేసుకుంది.


దీనికి సంబంధించిన కథలను ఇప్పుడు వరుసగా వింటుంది. ఇప్పటికే చెన్నైలో ఓ ఆఫీస్ ని సైతం సోనాక్షి సిన్హా తీసుకుంది. అయితే సోనాక్షి వద్దకి ఓ హీరోయిన్ ఓరియంటెడ్ కథ రావటం జరిగింది. ఈ  కథ తనకు సూట్ కాదు, కానీ ఎవరైనీ తీస్తే పెట్టుబడులు పెడతానని చెప్పుకొచ్చిందట. ఆ స్టోరీ ఇప్పుడు అనుష్క వద్దకు వచ్చింది. కథ నచ్ఛటంతో అనుష్క వెంటనే ఒప్పుకుందని అంటున్నారు. దీంతో ఈ మూవీ నిర్మాతలలో ఒకరుగా సోనాక్షి సిన్హా ఉండటం విశేషం.


స్వయంగా సోనాక్షి సిన్హానే ఆ కథకి తన కంటే అనుష్కనే బాగా సెట్ అవుతుందని చెప్పుకువచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించని న్యూస్ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాక్స్ గా వినిపిస్తున్నాయి. అయితే అనుష్క ప్రస్తుతం భాగమతి, ఓం నమోవేంకటేశాయ వంటి చిత్రాలలో నటిస్తున్నారు. ఈ చిత్రాల తరువాత తను సోనాక్షి సిన్హా నిర్మాణంలో నటించనున్నారని అంటున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు ఊపందుకున్నాయనేది కోలీవుడ్ వర్గాల నుండి వినిపిస్తున్న టాక్స్. 


మరింత సమాచారం తెలుసుకోండి: