పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వంలో తన లేటెస్ట్ సినిమాను త్వరలో పూర్తి చేస్తాడు అని అందరూ ఎదురు చూస్తూ ఉంటే పవన్ తన వీరాభిమాని వినోద్ రాయల్ మరణం తరువాత తిరుపతి చేరుకొని అతడి కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా తిరుపతిలోనే ఉంటూ ఏకంగా రేపు ఒక బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేస్తూ ఉండటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం పవన్ నిర్వహించబోయే ఈ బహిరంగ సమావేశానికి ‘మహాసభ’ అని నామకరణం చేసినట్లు టాక్.  అంతేకాకుండా ఈ బహిరంగ సమావేశానికి పవన్ అభిమానులు మాత్రమే కాకుండా ‘జనసేన’ సానుభూతి పరుఅలను కూడ పిలుస్తునట్లు తెలుస్తోంది.  ప్రుస్తుతం పవన్ తిరుపతిలోని ఒక గెస్ట్ హోస్ లో ఉంటూ తన సన్నిహితులతో అదేవిధంగా తన అభిమానులతో క్షణం తీరిక లేకుండా చర్చలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

అయితే పవన్ ఇలా హఠాత్ గా ఇటువంటి బహిరంగ సమావేశ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో ఎవరికీ అర్ధం కాని ప్రశ్నగా మారింది అని టాక్.  అయితే ఈ బహిరంగ సమావేశం కేవలం తన వీరాభిమాని వినోద్ మృతికి సంతాపం తెలియచేయడానికి ఏర్పాటు చేసిన సభగా మారుతుందా ? లేదంటే వినోద్ కు సంతాపం తెలుపుతూనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ను కుదిపేస్తున్న స్పెషల్ స్టేటస్, కాపు రిజర్వేషన్ సమస్య, అమరావతి రైతుల సమస్యలు లాంటి కీలక అంశాలను కూడ టచ్ చేసే బహిరంగ సభగా మారుతుందా ? అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగి పోతోంది. 

ఈ విషయం ఇలా ఉండగా చిరంజీవి ‘ప్రజారాజ్యం’ మొట్టమొదటి ‘బహిరంగ సభ 2008 ఆగష్టు 26న జరిగిన నేపధ్యంలో అదే తిరుపతి సెంటిమెంట్ ను కొనసాగిస్తూ పవన్ తన మొట్టమొదటి బహిరంగ సమావేశాన్ని తిరుపతి లోనే ఏర్పాటు చేయడం యాదృచ్చికం అనుకోవాలి.  అయితే ఈ బహిరంగ సభ వెనుక ఏదైనా సెంటిమెంట్ దాగి ఉందా అన్న కోణంలో కూడ రకరకాల ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

ఇది ఇలా ఉండగా తిరుపతి గెస్ట్ హౌస్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ను తిరుపతి నెల్లూరు రాయలసీమ లకు చెందిన అనేక మంది కాపు నాయకులు పవన్ కళ్యాణ్ ను కలిసి అనేక సమాలోచనలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  దీనితో రేపటి బహిరంగ సమావేశంలో ఏమి జరగబోతోంది అన్న ఆ శక్తి అందరిలోనూ బాగా పెరిగిపోతోంది.

ఇప్పటి వరకు అనేక విషయాల ఫై మౌన ముద్ర వహించిన పవన్ తన మౌనాన్ని వీడతాడా ? లేదంటే చనిపోయిన వినోద్ ఆత్మ శాంతిని కోరుతూ కొవ్వుత్తులు వెలిగించే సంతాప సభగా ఈ మహాసభ మారబోతోందా ? అన్న కామెంట్స్ అంతర్లీనంగా వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: