ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో పలు చిత్రాలు రిలీజ్ కి నోచుకోలేక పలు వాయిదాలు పడుతూ వస్తున్నాయి. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఇండస్ట్రీకి ఏదైనా ప్రత్యేక సందర్భం వచ్చినప్పుడు మాత్రం పెండింగ్ లో ఉన్న చిత్రాలు ఒక్కసారిగా రిలీజ్ కి సిద్ధం అవుతాయి. ఆ విధంగానే ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోని పలు చిత్రాలు త్వరలోనే రిలీజ్ కి సిద్ధం అవుతున్నాయి.


ఇలా రిలీజ్ కి సిద్ధం కావటానికి కారణం దసర పండుగ. అక్టోబర్ 11న రానున్న దసరా పండుగ సందర్భంగా పలు చిత్రాలకి రిలీజ్ అవుతున్నాయి. అయితే ఈ పండుగ బరిలో టాప్ హీరోలకి సంబంధించని చిత్రాలు సైతం రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇప్పటికే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ ధృవ‌ అక్టోబర్ లో రిలీజ్ అవుతుంది.


ఇప్పటికే దసరా పండుగకి వస్తుందని ఇప్పటికే ఫిక్స్ అయింది. అయితే ఇప్పటి వరకూ చరణ్ నటిస్తున్న ధృవ‌ మూవీ ఒక్కటే దసర బరిలో ఉందని అందరూ అనుకున్నారు. తాజాగా ఆ సీన్ కాస్త మారిపోయింది. ధృవ‌ మూవీతో పాటు స్టార్ హీరో నాగచైతన్య నటించిన అప్ కమింగ్ ఫిల్మ్ ప్రేమమ్ సైతం అదే సమయంలో రిలీజ్ అవుతుంది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై నాగచైతన్య భారీ నమ్మకాన్నే పెట్టుకున్నారు.


ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్ దసరాకి ఉంటుందని తెలియగానే ఇది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ధృవ‌ మూవీ మార్కెట్ ని కొంత దెబ్బతీసే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ప్రేమమ్ మూవీకి సంబంధించని ప్రమోషన్స్ ని చిత్ర యూనిట్ స్టార్ట్ చేసింది. మొత్తంగా షడన్ గా ఎంట్రి ఇచ్చిన నాగచైతన్య మూవీని చూసి...రామ్ చరణ్ షాక్ అయ్యాడని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: