సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఫిల్మ్ కెరీర్ ని కొనసాగిస్తున్న హీరోయిన్ సమంత. 2014 నుండి సమంత ఇండస్ట్రీలో నెంబర్ పొజిషన్ లో  కొనసాగుతూ వస్తుంది. తనకి ఏ మాత్రం విశ్రాంతి లేకుండా వరుస షెడ్యూల్స్ లో నటిస్తూ వస్తుంది. అలాగే తను నటించిన ప్రతి సినిమా ఇండస్ట్రీ వద్ద హిట్ ని కొట్టడంతో..ఈ బ్యూటీకి 2016లో భారీ చిత్రాలను వరించాయి.


2016వ సంవత్సరంలో సమంత ఒప్పుకున్న చిత్రాల సంఖ్య 8. ఇందులో ఇప్పటికే 5 చిత్రాలు రిలీజ్ కాగా వాటిలో ఎక్కువ శాతం బాక్సాపీస్ ని షేక్ చేసిన చిత్రాలు ఉండటం విశేషం. వీటిలో ఎన్నో ఆశలు పెట్టుకున్న బ్రహ్మోత్సవం సినిమా మాత్రం బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ ని సాధించి, సమంతకి కొంత నిరుత్సాహన్ని మిగిల్చింది. అయితే సమంతకి మార్కెట్ లో ఇంత హైప్ ఉన్నప్పటికీ..ఈ బ్యూటికి మాత్రం షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవాలు తగ్గిపోయాయి.


2015వ సంవత్సరం వరకూ సమంత అత్యధికంగా ప్రారంభోత్సవాల కార్యక్రమాలలో పాల్గొంది. ఆ తరువాత సమంత తన రెమ్యునరేషన్ ని పెంచటంతో పలు సంస్థలు ఈ బ్యూటీని రిబ్బన్ కటింగ్ లకి పిలవటం తగ్గించారు. ఈ ప్లేస్ ఇండస్ట్రీకి చెందిన ఇతర హీరోయిన్స్ వరుస అవకాశాలను చేజిక్కించుకున్నారు. రెజీనా, రకుల్ ప్రీత్, కాజల్ వంటి హీరోయిన్స్ ఈ ఆఫర్స్ ని ఎక్కువుగా అందుకున్నారు.


ఇక తాజా రిపోర్ట్స్ ప్రకారం నెంబర్ వన్ లోఉన్న సమంత ప్రస్తుతం నెంబర్ 5కి చేరుకుంటుందని అంటున్నారు. ఇక నెంబర్ లో వన్ లో ఉన్న హీరోయిన్ ఎవరు అంటే అది రెజీనా కసాండ్ర అని రిపోర్ట్స్ చెబుతున్నాయి. రెజీనా కసాండ్ర అటు తమిళనాడు, ఇటు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా కమర్షియల్ బిజినెస్ ల ప్రారంభోత్సవాలను చేపట్టారు. ఇకనైన సమంత తన కాల్షీట్ ని తగ్గించుకుంటే ఈ తరహా రిబ్బన్ కటింగ్ లకి అవకాశాలను చేజిక్కించుకునే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: