‘జనతా గ్యారేజ్’ మూవీలో సమంత మెయిన్ హీరోయిన్ అయినా ఆమె ‘జనతా గ్యారేజ్’ ఆడియో ఫంక్షన్ కు డుమ్మా కొట్టడంతో ఆ రోజు జరిగిన ఆడియో ఫంక్షన్ లో నిత్యామీనన్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారిన విషయం తెలిసిందే.  ఇక ‘జనతా గ్యారేజ్’ విడుదలకు కౌంట్ డౌన్ ప్రారంభం కావడంతో ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ ప్రారంభంచిన నిత్యామీనన్ కు జతగా జూనియర్ ఎన్టీఆర్  రంగంలోకి దిగుతున్నాడు.

జూనియర్ ఈసినిమా గురించి కొన్ని ప్రముఖ ఛానల్స్ కు అదేవిధంగా కొన్ని ప్రముఖ దినపత్రికలకు ఇంతర్వ్యులు ఇచ్చే కార్యక్రమం ఇప్పటికే మొదలు పెట్టేసాడు.  దీనికితోడు ఒకటి రెండురోజుల్లో జూనియర్ ఎఫ్ యమ్ రేడియోల్లో కూడ ‘జనతా గ్యారేజ్’ పబ్లిసిటీని మొదలు పెట్టబోతున్నాడు.

అయితే అటు నిత్యామీనన్ ఇటు జూనియర్ లు ఈసినిమా పబ్లిసిటీ గురించి రంగంలోకి దిగినా ఈ సినిమా మెయిన్ హీరోయిన్ సమంత ఈ పబ్లిసిటీ కార్యకమాలకు ఎప్పుడు జాయిన్ అవుతుందో ఈ సినిమా యూనిట్ కే తెలియని పరిస్థితి ఏర్పడింది అన్న వార్తలు వస్తున్నాయి.  ఈసినిమా దర్శక నిర్మాతల నుండి సమంతకు ‘జనతా గ్యారేజ్’ ప్రమోషన్ కార్యక్రమాలలో జాయిన్ అవమని సందేశాలు పంపుతున్నా సమంత పెద్దగా స్పందించడం లేదు అని టాక్.

ఏవో రకరకాల చిన్నచిన్న కారణాలు చెపుతూ సమంత ఈసినిమా ప్రమోషన్ వ్యవహారాల నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఈ సినిమా యూనిట్ కే కాకుండా జూనియర్ కు కూడ షాక్ ఇస్తున్నట్లు టాక్.  అయితే ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం సమంత ఇలా ప్రయత్నించడానికి ఒక కారణం ఉంది అని అంటున్నారు.

‘జనతా గ్యారేజ్’ సినిమా కోసం ప్రమోషన్ కార్యక్రమాలకు వస్తే నాగచైతన్య తో తన పెళ్ళి వ్యవహారం గురించి ప్రశ్నలు ఎదురైతే ఏమి చెప్పాలో తెలియని పరిస్థుతులు ఏర్పడటంతో సమంత ఇలా ప్రవర్తిస్తోంది అని టాక్. అందువలన సమస్య ఎందుకని మీడియాకు దూరంగా ఉండాలి అన్న ఉద్దేశ్యంతో సమంత ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కావాలని పక్కకు పెడుతోంది అని అంటున్నారు.   

దీనితో ఈ విషయాలను తెలుసుకున్న జూనియర్ సమంత బదులు నిత్యామీనన్ ను ఈసినిమా పబ్లిసిటీ కోసం పూర్తిగా రంగంలోకి దింపమని కొరటాలకు సూచించినట్లు టాక్.  ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో సమంత సమస్యలు నిత్యామీనన్ కు అదృష్టంగా మారి ‘జనతా గ్యారేజ్’ ప్రమోషన్ కార్యక్రమాలలో జూనియర్ తరువాత రెండవ స్థానాన్ని నిత్యామీనన్ ఆక్రమిస్తోంది అంటూ ఆమె అదృష్టం పై కామెంట్స్ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: