టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఏ ఇండస్ట్రీలో అయిన హీరోలకు, హీరోయిన్లకు అభిమానులు ఉంటారు. అయితే అగ్ర హీరోల విషయాల్లో ఇది కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. అభిమాన హీరోలకు సంఘాలు ఉంటాయి..తమ హీరోకి సంబంధించిన ఏ ఈవెంట్ వచ్చిన వారి హంగామా అంతా ఇంతా ఉండదు. ఒకప్పుడు నటి ఖుష్బుకి తమిళ తంబీలు ఏకంగా గుడి కట్టించిన వార్త అప్పట్లో సంచలనం రేపింది. ఇలా హీరోల పట్ల అభిమానం ఉంటే పెద్ద విషయం కాదు కానీ అప్పుడప్పుడు ఆ అభిమాన వెర్రితలలు వేయడమే కొంప ముంచుతుంది. ఆ మద్య పవన్, ప్రభాస్ అభిమానులు తీవ్రంగా కొట్టుకొని జైలుకు వెళ్లిన సంఘన జరిగింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపిన పవన్ కళ్యాన్ అభిమాని, జనసేన కార్యకర్త వినోద్ రాయల్ ని అతని స్నేహితుడే ఎన్టీఆర్ వీరాభిమాని దారుణంగా పొడిచి చంపిన సంగతి తెలిసిందే.
Image result for pawan kalyan tirupati
అయితే ఈ విషయం టాలీవుడ్ ని షేక్ చేసింది. పవన్ కళ్యాన్ స్వయంగా బాధితుడి ఇంటికి వెళ్లి వారిని ఓదార్చాడు..వారిక కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చారు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్ ఈ పనిచేసిందని తెలియగానే జూనియర్ ఎన్టీఆర్  తీవ్రంగా కలిచి వేసిందట..ఒక దశలో కంట నీరు వచ్చిందట. ఏ హీరో అభిమాని అయినా ఓ తల్లికి కొడుకే కదా అలాంటి ఆమె పడే ఆవేదన ఎలా ఉంటుందో తనకు తెలుసని అన్నారు. ఇక ఆడియో వేడుకలకు వచ్చిన అభిమానులకు వెళ్లే ముందు జాగ్రత్తగా వెళ్లమని పదే పదే చెప్పే ఎన్టీఆర్ తన అభిమాని ఇంత పనిచేయడంతో అసహనానికి గురైనట్లు తెలుస్తుంది. అభిమానం ఉండవొచ్చు కాని ఇంత మూర్ఖత్వం ఉండకూడదుల అన్నారు.
Image result for tollywood heros
ఇండస్ట్రీలో హీరోలు అందరూ తమ వృత్తి పరంగా పోటీగా ఉంటామే తప్పా వ్యక్తిగతంగా తామంతా ఒకే కుటుంబంలా కలిసి ఉంటామని అన్నారు. మా మద్య ఎటువంటి పోటీ లేదు పైగా ఎవరు గొప్ప ? ఎవరు తక్కువ ? అన్న సమస్యే లేదు కానీ అభిమానుల మద్య మాత్రం ఇంత రాద్దాంతం ఎందుకు ? అని ఎన్టీఆర్ తన సన్నిహితుల వద్ద వాపోయాడట .  ఈ సమయంలో ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వొద్దు అంటూ తన అభిమానులకు సందేశాన్ని పంపించాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: