తెలుగు చిత్రం పరిశ్రమలో వారసత్వపు హీరోగా ఎంట్రీ ఇచ్చిన వారిలో తమిళ నటుడు విజయ్ కుమార్, మంజుల తనయుడు తమిళ నటుడు అనుణ్ విజయ్ మొదట హీరోగా ఎంట్రీ ఇచ్చి తర్వాత విలన్ అవతారం ఎత్తాడు.  తమిళ స్టార్ హీరో అజిత్, అనుష్క నటించిన ఎంతవాడుకాని చిత్రంలో విలన్ గా నటించి హీరోకి సమానంగా పేరు తెచ్చుకున్నాడు.

తర్వాత శ్రీనువైట్ల దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా నటించిన ‘బ్రూస్ లీ’ చిత్రంలో విలన్ గా నటించాడు. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు తీసిన అరుణ్ విజయ్ తాజాగా  డ్రంకన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డాడు.

శుక్రవారం అర్థరాత్రి ఆయన ఓ ప్రైవేట్ ఫంక్షన్ కి అటెండ్ అయిన తర్వాత తిరుగు ప్రయాణంలో మంతు సేవించి డ్రైవింగ్ చేస్తుండగా  చెన్నై నుగంబాక్కం పోలీస్ స్టేషన్ పరిథిలో పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: