ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు ఏదొక సమయంలో వారి మానవత్వాన్ని చాటుతూనే ఉంటూరు. ఎంతటి హైఫై సొషైటీలో జీవిస్తున్నప్పటికీ...కొన్ని సందర్భాలు వారి మనస్సుని సైతం కదిలిస్తాయి. ఇప్పుడు అదే విధంగా కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హీరో విశాల్. తన మానవత్వాన్ని చాటాడని అంటున్నారు. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం,తాజాగా హీరో విశాల్ సొంతంగా ఓ సోషియల్ ఆర్గనైజేషన్ ని రన్ చేయాలని భావించాడంట.


అందులోని భాగంగానే తన సంస్థకి మూల నిధులుగా దాదాపు 5 కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ నిధులను చెన్నైలో ఫుట్ పాత్ జీవనాన్ని గడుతున్న వారి బాగోగుల కోసం కేటాయిస్తున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. చెన్నై మహానగరంలో నిత్యం ఎంతో మంది ఫుట్ పాత్ లపైనే జీవనాన్ని కొనసాగిస్తుంటారు. వారి పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. అందుకే విశాల్ తన ఆర్గనైజేషన్ ద్వారా ఫుట్ పాత్ జీవనాన్ని గుడుపుతున్న వారికి కనీసం ఒక పూటైన మంచి ఫుడ్ ని, అలాగే వారి కావాల్సిన చిన్నపాటి మౌళిక వసతులను సమకూర్చాలని చూస్తున్నారు.


ఇక ఫుట్ పాత్ జీవనాన్ని కొనసాగిస్తున్న వారిలో ఎవరికైనా పనులను చేసుకొనే శక్తిసామార్ధ్యాలు ఉంటే వారికి తగిన ఉధ్యోగాన్ని సైతం ఈ సంస్థ కల్పించనుందని అంటున్నారు. మొత్తంగా విశాల్ తీసుకున్న ఈ నిర్ణయం చెన్నై ఫుట్ పాత్ జీవినాన్ని కొనసాగించే వారి జీవితాన్నే మార్చేయనుందని అంటున్నారు. ఇక విశాల్ తో పాటు పలువురు హీరోలు సైతం ఈ సేవలో వారి వంతు సేవ చేయనున్నారు.


గతంలోనూ చెన్నె వరదల సమయంలో విశాల్ టీం చక్కని సేవా కార్యక్రమాలను చేసింది. రాత్రిపగలూ చెన్నై వీధుళ్లో తిరుగుతూ వారు చేయగలిగేంత సహాయాన్ని చేశారు. ఇదిలా ఉంటే తాజాగా విశాల్ నటించిన 'కత్తి సండై' సినిమా థియోటర్స్ ని హిట్ చేయటానికి రెడీగా ఉంది. ఈ నెల 29న విశాల్ పుట్టినరోజున ఈ మూవీకి సంబంధించిన రెండు భాషల్లోనూ టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: