డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూర్తి జగన్నాథ్ దర్శకత్వ ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పూరి డైరక్షన్లో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలొచ్చాయి. అయితే కొద్దికాలంగా సూపర్ హిట్ కు దూరంగా ఉన్న పూరి మరోసారి తనలో ఉన్న కసి అంతా పోగేసి కళ్యాణ్ రామ్ ఇజంతో బయట పెట్టబోతున్నాడు. అందుకే సినిమా గురించి అంతా గోప్యంగానే ఉంచుతున్నారు.


ఇజం ఫస్ట్ లుక్ తోనే కళ్యాణ్ రామ్ సినిమా గురించి సినిమా పరిశ్రమంతా మాట్లాడుకునేలా చేసిన పూరి ఈ సినిమాతో కళ్యాణ్ రాంకు స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టేందుకు కృషి చేస్తున్నాడు. నందమూరి అభిమానుల అండదండలున్నా కళ్యాణ్ రామ్ సోలో ఇమేజ్ కు దూరంగా ఉన్నాడు. ఇక లాస్ట్ ఇయర్ పటాస్ తో ఓ పవర్ ఫుల్ హిట్ అందుకున్నా ఆ తర్వాత వచ్చిన షేర్ మళ్లీ ఇమేజ్ డ్యామేజ్ చేసింది.  


అందుకే ఇజంతో పూరి కళ్యాణ్ రాంకు ఓ బ్లాక్ బస్టర్ ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ కావచ్చిన ఈ సినిమా అవుట్ పుట్ చిత్రయూనిట్ అంతా సాటిస్ఫైడ్ గా ఉన్నారట. ఇజం అంటూ తనలోని కస్తి మొత్తం మరోసారి చూపించేందుకు సిద్ధమైన పూరి హిట్ కొట్టడం కన్ఫాం అనిపిస్తుంది. 


ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ పతాకంలో కళ్యాణ్ రాం నిర్మిస్తున్న ఈ సినిమాలో అదితి ఆర్య హీరోయిన్ గా నటిస్తుంది. మరి కళ్యాణ్ రామ్ కు స్టార్ ఇమేజ్ తెచ్చే క్రమంలో ఇజం చేస్తున్న పూరి తన ఫ్లాపుల ఖాతాకు కూడా ఫుల్ స్టాప్ పెట్టి సూపర్ హిట్ తో తానేంటో మరోసారి ప్రూవ్ చేసుకుంటాడేమో చూడాలి. సెప్టెంబర్ 29న రిలీజ్ అవ్వబోతున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.


ఇక ఫస్ట్ లుక్ పోస్టర్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన పూరి కళ్యాణ్ రామ్ ఏ సినిమాకు లేని ప్రీ రిలీజ్ బజ్ ఏర్పాటు చేశాడు. అంతేకాదు సినిమా బిజినెస్ కూడా ఇప్పటికే టేబుల్ ప్రాఫిట్ తో ఉందని టాక్. ఇదే క్రమంలో సినిమా హిట్ కొడితే ఆ కిక్ ఇంకా డబుల్ అయ్యే అవకాశాలున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: