హిట్ కోసం తపిస్తున్న ఓ హీరో కోసం మరో హీరో సహాయం చేయడం కొత్తేమి కాదు ఇక బయట ఫ్రెండ్స్ గా ఉన్న హీరోలైతే ఇంకాస్త ఎక్కువ కేర్ తీసుకుంటారు. అయితే ప్రస్తుతం ఇలాంటి క్రేజీ కాంబినేషన్ లోనే ఓ సినిమా రాబోతుందని ఫిల్మ్ నగర్ న్యూస్. బాహుబలితో ప్రభాస్ క్రేజ్ ఎక్కడికి చేరిందో తెలిసిందే ఇప్పుడు ఆ ఇమేజ్ ను తన సినిమాకు వాడాలని డిసైడ్ అయ్యాడు హీరో గోపిచంద్.


కెరియర్ మొదట్లో మాస్ కమర్షియల్ సినిమాలు చేసి అవి కాస్త బోర్ కొట్టి ఫ్యామిలీ ఎంటర్టైన్ మెంట్ జానర్ ఎంచుకున్న గోపిచంద్ ఈ మధ్య సక్సెస్ కొట్టి చాలా కాలం అవుతుంది. తీస్తున్న సినిమాలేమో బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతున్నాయి అందుకే మళ్లీ తనకు నచ్చిన మాస్ సినిమాలవైపే అడుగులేస్తున్నాడు. ఇక ఏమైంది ఈవేళ, రచ్చ, బెంగాల్ టైగర్ ఇలా మూడు సినిమాలతో తన ఖలేజా ఏంటో చూపించిన సంపత్ నంది గోపిచంద్ తో సినిమా తీస్తున్నాడు.


ఇక ఈ సినిమాలో ఓ గెస్ట్ రోల్ అవసరం ఉండగా అది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయించడానికి ఒప్పించారట. ప్రభాస్, గోపిచంద్ ల స్నేహం ఈనాటిది కాదు ఇద్దరు కలిసి వర్షం సినిమా చేశారు. ఇక గోపిచంద్ కు హిట్ రావాలని కోరుకునే వారిలో ప్రభాస్ ఒకరు. అందుకే తన ఫ్రెండ్ కోసం ప్రత్యేక పాత్రకు సై అనేశాడు.


రెబల్ నిర్మాతలు జె. భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్న ఈ సినిమాలో హాన్సిక, కేథరిన్ లు హీరోయిన్స్ గా చేస్తున్నారు. మరి మాస్ కథలకు హీరో ఇమేజ్ జోడించి పర్ఫెక్ట్ గా తీసే సంపత్ నంది గోపిచంద్ ఇమేజ్ ను ఏ రేంజ్ కు తీసుకెళ్తాడో చూడాలి. సర్దార్ తర్వాత రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా బెంగాల్ టైగర్ తో మాస్ మహరాజ్ రవితేజను మరోసారి ఫ్యాన్స్ మెచ్చేలా చేసిన సంపత్ గోపిచంద్ కు సరైన హిట్ ఇస్తాడనే ఆశిస్తున్నారు సిని అభిమానులు.



మరింత సమాచారం తెలుసుకోండి: