ఈ వారం విడుదల కాబోతున్న ‘జనతా గ్యారేజ్’ సినిమాను ప్రమోట్ చేస్తూ దర్శకుడు కొరటాల శివ హీరోల నెంబర్ గేమ్  పై సంచలన వ్యాఖ్యలు చేసాడు.  ఇది వరకు అభిమానులు సినిమాలను చూసి అవి బాగున్నాయో లేవో అనే విషయం పై మాట్లాడే వారని ఇప్పుడు ఆ విషయాలను మాట్లాడకుండా హీరోల అభిమానులు మొదటిరోజు వసూళ్ళ గురించి మాట్లాడుతున్నారని దీనితో హీరోలకు టెన్షన్ పెరిగి పోయి సినిమాలి తన పాత్ర కంటే మొదటి రోజు వసూళ్ళకే ప్రాధాన్యత ఇవ్వ వలసి వస్తోందని కామెంట్స్ చేసాడు కొరటాల.

అయితే ఈ లెక్కల పోటీ లేకుండా ఉంటే హీరోలు అంతా మనశ్శాంతిగా ఉండి తాము చేసే సినిమాల పై దృష్టి పెడతారని హీరోలు కూడ పట్టించు కోవడం మానివేసిన ఫస్ట్ డే కలక్షన్స్ రికార్డులను అభిమానులు ఎందుకు ఇంత సీరియస్ గా పట్టించు కుంటున్నారో తనకు అర్ధం కావడం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు కొరటాల.  ఇదే సందర్భంలో కొరటాల మాట్లాడుతూ హీరోయిజమ్ కుటుంబ చరిత్రకు సంబంధించిన  డైలాగ్స్ వ్రాస్తే జనం చూసే రోజులు ఇప్పుడు లేవనీ ప్రేక్షకులు పూర్తిగా మారిపోయారు అంటూ ఆసక్తి గల కామెంట్స్ చేసాడు కొరటాల.

ప్రేక్షకులకు చెప్పే విధంగా మంచి విషయాలు చెపితే వారు మారుతారని తన అభిప్రాయమని అంటూ తాను తీసే సినిమాలలో ఎదో ఒక మంచి విషయం చెపుతూ ప్రజలలో మార్పు తేవాలని తాను ప్రయత్నిస్తున్నాను అంటూ తాను ఉంటున్న అపార్ట్ మెంట్ చుట్టూ తాను మొక్కలు నాటిన తరువాత తనను చూసి చాలామంది మొక్కలు నాటిన విషయాన్ని చెపుతూ మంచి చేసి చూపెడితే కొంతమంది అయినా అనుసరిస్తారు అన్న ఆశ ఉంది అన్న కామెంట్ చేసాడు.

ఇక తాను అందరి హీరోలతోనూ సినిమాలు చేయాలనే కోరిక తనకు ఉంది అని చెపుతూ ప్రభాస్ కు రామ్ చరణ్ కు తగ్గట్టుగా వ్రాసిన కథలు తన దగ్గర ఉన్నాయని అయితే అవి ఎప్పుడూ మొదలవుతాయో తనకు తెలియదని అంటూ ఆ శక్తికర కామెంట్స్ చేసాడు కొరటాల.  మహేష్ తో తాను వచ్చే సంవత్సరం మొదలు పెట్టబోయే సినిమా ‘శ్రీమంతుడు’ కి సీక్వెల్ కాదని అది మరో వెరైటీ కథ అంటూ తన మనసులో మాట బయట పెట్టాడు.

ఈ భూమి మీద ఉండే ప్రకృతిని ఇష్టపడే ఒక యువకుడు మనుషులను ప్రేమించే మరొక పెద్దాయన కథగా ‘జనతా గ్యారేజ్’ ఉంటుంది అని ఈ సినిమా విడుదల తరువాత చాలామంది ప్రకృతిని ప్రేమించే వ్యక్తులుగా మారుతారు అని ఆశ పడుతున్నాడు కొరటాల..   



మరింత సమాచారం తెలుసుకోండి: