నిన్న చిరంజీవి తన ‘ఖైదీ నెంబర్ 150’ షూటింగ్ కు నిన్న మధ్యాహ్నం నుంచి బ్రేక్ ఇచ్చి తన ఇంటికి వెళ్ళిపోయిన చిరంజీవి పవన్ కళ్యాణ్ తిరుపతి బహిరంగ సభ ఉపన్యాసాన్ని చాల జాగ్రత్తగా ప్రతి పదం ఏకాగ్రతతో విన్నట్లు వార్తలు వస్తున్నాయి.  ముఖ్యంగా పవన్ తన ఉన్యాసంలో కాంగ్రెస్ ను అదేవిధంగా అప్పటి పార్లమెంట్ మెంబర్లు మంత్రులు సోనియాగాంధీకి వొంగి వొంగి నమస్కారాలు పెట్టి ఆమె ముందు ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరుగుతున్నా మాట్లాడలేకపోయిన పరిస్థితిని వివరిస్తూ వేసిన సెటైర్లకు చిరంజీవి కొద్దిగా షాక్ అయినట్లు కనిపించాడని తెలుస్తున్న విశ్వసనీయ సమాచారం.

పవన్ ఉపన్యాసం పై విశ్లేషణ చేస్తూ ఒక ప్రముఖ ఛానల్ నిర్వహించిన చర్చా గోష్టిలో ఆ కార్యక్రమ నిర్వాహకుడు మాట్లాడుతూ సోనియాగాంధీకి వొంగి వొంగి నమస్కారాలు చేసిన లిస్టులో తన అన్న చిరంజీవి ఉన్న విషయాన్ని మరిచి పోయాడా అని చేసిన కామెంట్స్ చిరంజీవికి మరింత అసహనాన్ని  కలిగించినట్లు టాక్.  

ఈ వార్తలు ఇలా ఉండగా పవన్ తన సుదీర్ఘ ఉపన్యాసంలో మధ్యలో తన అభిమానులను ఉద్దేశించి ‘మీరు సర్దార్ చూడలేదు అందుకే నాకు డబ్బురాలేదు కొంచెం నా
సినిమాలు కూడ చూడండబ్బా’ అంటూ జోక్ చేస్తూ చురకలు అంటించడం చాలామందిని ఆశ్చర్య పరిచింది.  దీనిని బట్టి చూస్తూ ఉంటే ‘సర్దార్ గబ్బర్ సింగ్’ పరాజయం పవన్ కు ఎంత షాక్ ఇచ్చిందో అర్ధం అవుతుంది.

ఇది ఇలా ఉండగా నిన్న కొనసాగిన పవన్ ప్రసంగం ఎవర్ని నొప్పించకుండా మరెవర్ని గట్టిగా నిలదీయకుండా మరో సంవత్సర కాలానికి సరిపడే సుధీర్ఘ ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కు సంబంధించి తన మనసులోని ఉద్దేశ్యాలను బయట పెట్టి మరో సంవత్సరం వరకు పవన్ తన పై విమర్శలు రాకుండా చాల జాగ్రత్తగా తయారు చేసిన  స్క్రిప్ట్ ను ఆచితూచి పవన్ మాట్లాడాడు అని విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం పై ఆంధ్రప్రదేశ్ లో పెరిగి పోతున్న ప్రజావ్యతిరేకతను మరో రాజకీయ పార్టీ వైపు దారి మళ్ళకుండా మిత్రపక్షమైన పవన్ ‘జనసేన’ సొమ్ము చేసుకుంటే మంచిది అన్న ఉద్దేశ్యంతో కొందరు పెద్దలు పవన్ ను చాల వ్యూహాత్మకంగా ఉపయోగించుకోవడానికి ఇలా రంగంలోకి దింపారు అన్న విశ్లేషణలు కూడ విని పిస్తున్నాయి.  

పవన్ ఎప్పటికీ తాను ‘గబ్బర్ సింగ్’ మాత్రమే అని ‘రబ్బర్ సింగ్’ కాదని మరోసారి నిరూపించుకున్నాడు.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: